India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముఠాపురం, శంకర్ గిరి తండా, రాజేశ్వరపురం గ్రామాల్లో స్థానిక ప్రజలతో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎరువుల ధరలకు తోడు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు గతంలో రూ.1,300 ఉంటే ఇప్పుడు రూ.1,900కు చేరాయి. గతంలో రూ.900కు లభించిన పొటాష్ ధర రూ.1,650కు, డీఏపీ ధర రూ.1,350కు చేరింది. ఫలితంగా పంట సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు, పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు.
భద్రాచలం వద్ద తీవ్ర విషాదం జరిగింది. గోదావరిలో స్నానానికి వెళ్లి బాలుడు మృతిచెందాడు. మొత్తం ఐదుగురు పిల్లలు గోదావరిలో దిగగా, అందులో ఒకరు మృత్యువాత పడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న మిగతా నలుగురు పిల్లలను బోట్ టీం సభ్యుడు ప్రసాద్ కాపాడారు. బాలుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలం గట్టు వివాదంలో ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ.25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. కొత్తగూడెం మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు.
విద్యుదాఘాతంతో <<13487218>>దంపతులు మృతి<<>> చెందిన ఘటన వైరాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంజనేయులు (60) నరసమ్మ (55) దంపతులు వైరాలోని హనుమాన్ బజార్ నివాసం ఉంటున్నారు. నరసమ్మ దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్ వచ్చింది. కేకలు వేయగా ఆంజనేయులు కాపాడేందుకు వెళ్లాడు. ఇద్దరూ కరెంట్ షాక్‌తో మృతి చెందారు.
ట్రైన్ ఎక్కుతూప్రమాదవశాత్తు జారిపడి టీవీ షో జబర్దస్త్‌లో సైడ్ యాక్టర్ మొహమ్మదీన్ మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తగూడెంలో జరిగింది. అతను షూటింగ్ కోసం HYD వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్న సమయంలో జారిపడి ప్లాట్ ఫామ్‌కి, ట్రైన్‌కి మధ్య ఇరుక్కున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ మరణించాడు.
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూముల రక్షణకు ఆ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి అంగుళం భూమికి పక్కా దస్త్రాలను ఆన్లైన్లో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మాన్యం ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దేవుని ఆస్తి ఎక్కడున్నా అది దేవునికే చెందుతుందని ఇప్పటికే ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. రాములవారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి.
ఖమ్మం జిల్లా వైరాలో తీవ్ర విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో వృద్ధ దంపతులు మృతి చెందారు. హనుమాన్ బజార్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.