Khammam

News March 30, 2024

మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం

image

భద్రాచలం: మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయిగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి. ఈ కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్‌లు, అభయారణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఆ పత్రాలలో పేర్కొన్నారు.

News March 30, 2024

అభ్యర్థిగా ప్రకటించి నెలవుతున్నా.. కనిపించని నామా..?

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్‌‌ఎస్ అన్ని పార్టీలకంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నామా పేరును ఖరారు చేసి నెలవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేదట. కడియం కావ్య ఎఫెక్ట్‌తో కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారంతో నామా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పోటీలోనే ఉంటారా? లేక పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైనట్లు సమాచారం.

News March 30, 2024

ఖమ్మం-బెంగళూరుకు లహరి ఏసీ బస్సులు

image

ఖమ్మం నుంచి బెంగళూరుకి లహరి ఏసి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడుపుతున్నట్లు DM శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం నుంచి సాయంత్రం 3 గంటలకు, 4.30 గంటలకు లహరీ బస్సు బయలుదేరుతుందన్నారు. బెంగళూరు నుంచి రాత్రి 6.30 గంటలకు, 7:45 గంటలకు బయలుదేరుతుందన్నారు. చార్జీల వివరాలు సీటుకు రూ. 1580, బెర్త్ కు రూ .2010 ఉందని తెలిపారు

News March 30, 2024

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి..?

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్ఠానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ. ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డిని ఖమ్మం బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రఘురామరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉండటమే కాక మంత్రి పొంగులేటికి వియ్యంకుడు.

News March 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News March 30, 2024

కొత్తగూడెం: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు గర్భం

image

బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, గర్భవతిని చేసిన వ్యక్తిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ములకలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను సమీప గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో కుటుంబీకులు ఆరా తీయగా, గర్భవతైన విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 30, 2024

జిల్లాలో పెరుగుతున్న బ్రూణహత్యలు

image

ఖమ్మం జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా బ్రూణహత్యలు జరుగుతున్నాయని ఇటీవల ఘటనల ద్వారా తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం, కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు చిదిమేస్తున్నారు . లింగ నిర్ధారణ నేరమైనా ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లకు అదేమీ పట్టడం లేదు. దీంతో క్రమంగా ఆడశిశువుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను 929 అమ్మాయిలే ఉన్నారు.

News March 30, 2024

ఖమ్మం జిల్లాలో అడుగంటిన జలాశయాలు

image

ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు వట్టిపోయాయి. ప్రధాన రిజర్వాయర్లైన పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్లో నీరు అడుగంటింది. మిగతా చిన్నాపెద్ద చెరువుల్లో కూడా నీళ్లు అడుగంటడంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణం నెలకొంది. బోర్లు, బావుల్లో నీళ్లు లేక సాగు చేసిన పంటలు పలు ప్రాంతాల్లో ఎండిపోయాయి. మరో మూడు, నాలుగు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

News March 30, 2024

KMM: భార్యను కాపాడబోయి భర్త మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుబల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. కుప్పెనకుంట్లకి చెందిన వల్లవరపు రవి(43) భార్య ప్రమాదవశాత్తు విద్యుత్ తీగను తాకడంతో షాక్‌కు గురైంది. రవి ఆమెను కాపాడే క్రమంలో షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 30, 2024

ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. జిల్లాలోని మరో 12 ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41.5 డిగ్రీల వరకు నమోదుకాగా.. ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.