Khammam

News July 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> నేటి నుంచి సింగరేణి ప్యాసింజర్ రైలు పున: ప్రారంభం  > ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు > చింతకాని మండలంతో సీపీఎం నేత రామ నరసయ్య సంస్కరణ సభ > ఖమ్మంలో ప్రజానాట్యమండలి శిక్షణా తరగతులు > గోదావరి వరదపై ఉన్నతాధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష > మణుగూరులో సింగరేణి పరిరక్షణకై కార్మికుల దీక్షలు

News July 13, 2024

రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

image

పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చించిన తరువాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. పప్పు దినుసులతో సహా అన్ని పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

News July 13, 2024

‘స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోండి’

image

2024 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్య కోసం క్రైస్తవ మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించనుంది. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా ఈనెల 8 నుండి ఆగస్టు 7లోపు అప్లై చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కే సంజీవరావు ప్రకటించారు. అప్లై చేసిన కాపీలను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 27 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News July 12, 2024

దోస్త్ సర్టిఫికెట్ల పరిశీలన గడువు పొడిగింపు 

image

ఖమ్మం : డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా గత మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన గడువు ఈనెల 18 వరకు పొడిగించామని SR&BGNR కళాశాల దోస్త్ కోఆర్డినేటర్  ఎం. సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజుల సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2రోజులు సెలవులు రానున్నాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు గమనించి 2 రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావద్దని అధికారులు తెలిపారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

News July 12, 2024

సీఎం రేవంత్‌తో భేటీ అయిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎమ్మెల్యేలు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎంను బేటి అయిన వారిలో పినపాక ఎమ్మెల్యే పాయం, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఎంపీ RRR లు ఉన్నారు.

News July 12, 2024

ఆ గ్రామానికి ఏమైంది? నెల రోజుల్లో పదిమంది మృతి

image

సుజాతనగర్ మండలం గరీబ్ పేటలో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. నెల రోజుల్లో గ్రామంలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకోగా, ఏడుగురు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల్లోనే పదిమంది మృతి చెందడంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామానికి శాంతి పూజ చేయించాలని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. అటు గ్రామంపై అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

News July 12, 2024

ఒడిస్సా సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ..!

image

ఒడిశాలోని లోక్‌సేవా భవన్‌లో శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌తో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 2015లో సింగరేణికి కేటాయించిన నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం సీఎంకు డిప్యూటీ సీఎం సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. ఈ భేటీలో సింగరేణి CMD పాల్గొన్నారు.

News July 12, 2024

అశ్వారావుపేట CI, నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్!

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సీఐ జితేందర్ రెడ్డితో పాటు, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా SP రోహిత్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ, కానిస్టేబుళ్లు వేధింపులు గురి చేస్తున్నారంటూ, గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మరణించిన విషయం తెలిసిందే. అటు సీఐ, కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News July 12, 2024

భద్రాచలం: పెరిగిన గోదావరి వరద నీటిమట్టం

image

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం 12 అడుగులు ఉన్న నీటిమట్టం గురువారం సాయంత్రం 4 గంటల వరకు 13 8 అడుగులకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు మరో 0.7 అడుగులు పెరిగి 14.5 అడుగులకు చేరుకోనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.