India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిద్రమాత్రలు మింగి 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మంలో చోటు చేసుకుంది. ముస్తఫానగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. పాఠశాల టీచర్స్ వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖమ్మం నగరంలోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు టౌన్ ఏసీపి రమణమూర్తి తెలిపారు. సారథినగర్లో జరిగిన దొంగతనంపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో గాంధీ చౌక్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమా శంకర్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడిని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 29 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

అనారోగ్యంతో ఐటీడీఏ ఏవో మృతి చెందిన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఏవో విధులు నిర్వహిస్తున్న పెందుర్ బీమ్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏవో మృతి పట్ల ఐటిడిఏ ఉద్యోగులు, ఐటిడిఏ పిఓ సంతాపం తెలిపారు.

ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు పెంపకం చేస్తూ పోలీసులకు పట్టుపడ్డ ఘటన శుక్రవారం చింతకాని మండల పరిధిలోని నాగులవంచలో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన కందిమల్ల వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు శ్రీహరి గంజాయి మొక్కలను పెంచుతూ యువకులకు సరఫరా చేస్తున్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్ మీరా తెలిపారు.

సింగరేణిలో 327 ఖాళీల భర్తీకి ఏప్రిల్ 24న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులకు ఆగస్టు 6, 7 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించనున్నారు. అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైని, జూనియర్ మైనింగ్ ఇంజనీర్, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ అభ్యర్థులకు 6న, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), అసిస్టెంట్ ఫోర్ మెం ట్రైనీ, వారికి 7న కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు.

ఖమ్మం జిల్లాలో వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. జిల్లా రైతంగానికి రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలుతో పాటు సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. అలాగే పంటల బీమా పథకం అమలుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరుతామని మంత్రి తెలిపిన నేపథ్యాన ఖమ్మం జిల్లాలో సుమారు 3.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీటికి తోడు ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో సీతారామ ప్రాజెక్టుకు రూ.799 కోట్లు కేటాయించారు. ఇందులో పంప్ హౌస్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు తదితర పనుల కోసం రూ.687 కోట్లు కేటాయించగా.. సీతమ్మసాగర్ బ్యారేజీ, దాని అనుబంధ పనుల కోసం రూ.111 కోట్లు బడ్జెట్ పద్దుగా మంత్రి మల్లు భట్టివిక్రమార్క చూపించారు. ఈ నిధులను అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వినియోగించనున్నారు.

పర్యాటకరంగంలోనూ ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కింది. ఎకో- టూరిజం (పర్యావరణ పర్యాటకం)ను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పెనుబల్లి, కల్లూరు, ఏన్కూరు, తల్లాడ, చండ్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల మధ్య విస్తరించిన కనకగిరి గుట్టలు, ఇక్కడి ఆలయాలు, ప్రాజెక్టులు అభివృద్ధికి నోచుకుంటాయి. అనువైన ప్రాంతాల్లో కాటేజీలు నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించనున్నారు.

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపుల్లో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. నీటిపారుదల, అటవీ, రోడ్లు, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ పనులకు నిధులు కేటాయించారు. తద్వారా జిల్లాలోని సీతారామ, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల పనులు ఊపందుకోనున్నాయి. అలాగే, ఎర్రుపాలెం మండలంలో ప్రత్యేకంగా ఎత్తిపోతలకు నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.