Khammam

News March 28, 2024

మధిర: ట్రాక్టర్ రోటవేటర్‌లో చెత్త తొలగిస్తుండగా రైతు మృతి

image

మధిర మండలం నిదానపురానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో మిర్చి పంటను సాగు చేశాడు. మిర్చి పంట పూర్తి కాగా వ్యర్థాలను తొలగించడానికి రైతు ట్రాక్టర్ రోటవేటర్‌తో దున్నుతున్నాడు. రోటవేటర్‌లో చెత్త ఇరుక్కుపోయి ఆగిపోవడంతో చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడిపోయాడు. తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

News March 28, 2024

కొత్తగూడెం: కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది

image

కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామస్థులు.. గ్రామపంచాయతీ కార్యదర్శి భవానీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో గొరిల్లా దుస్తులు కొనుక్కుని రెండుసార్లు గ్రామం, వ్యవసాయ పొలాల్లో తిరిగింది. కోతులు ‘గొరిల్లా’కు భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఆలోచనను అమలు చేస్తున్నామని, చాలా వరకు కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లాయన్నారు.

News March 28, 2024

30 నుంచి భద్రాచలం-విశాఖకు లహరి నాన్ ఏసీ బస్సులు

image

భద్రాచలం-విశాఖపట్నంకి లహరి నాన్ ఏసీ బస్సులను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భద్రాచలం DM రామారావు తెలిపారు. శనివారం భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు లహరి బస్సు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-భద్రాచలానికి ఉదయం 8 గంటలకు, రాత్రి 8:45 గంటలకు బస్సు ఉంటుందన్నారు.

News March 28, 2024

నేటి నుంచి భద్రాచలం- ఖమ్మం త్రీ స్టాప్ సర్వీసులు

image

నేటి నుంచి భద్రాచలం-ఖమ్మం మధ్య త్రీ స్టాప్ డీలక్స్ బస్సులను నడపనున్నట్లు భద్రాచలం డీఎం రామారావు తెలిపారు. ఈ బస్సులు భద్రాచలం-ఖమ్మం మధ్య పాల్వంచ, కొత్తగూడెం, ఏన్కూరు స్టాప్‌ల్లో మాత్రమే ఆగుతాయని తెలిపారు. ఈ బస్సుల్లో ఆధార్ కార్డుతో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

News March 28, 2024

చర్ల: ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్

image

మద్యం తాగి విధులకు హాజరైన చర్ల మండలం జీపీ పల్లి పాఠశాల <<12938027>>ప్రధానోపాధ్యాయుడు <<>>బానోత్ కృష్ణను సస్పెండ్ చేస్తూ డీఈఓ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ తెలిపారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్, మద్యం తాగి పాఠశాలకు రావడమే కాకుండా, విద్యార్థులను కొట్టాడు. దీంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించిన విషయం తెలిసింది. విచారణ చేపట్టిన డీఈఓ సస్పెండ్ చేశారు.

News March 28, 2024

పాల్వంచ: ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. కేసు నమోదు

image

భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రమ్యకు శివకృష్ణతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ రమ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News March 28, 2024

మణుగూరు: రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

image

మణుగూరు మండలం సమితిసింగారం రహదారిపై పాత సమ్మయ్య ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంబమూర్తి(55) అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. మణుగూరు నుంచి పీవీ కాలనీకి బైక్‌పై వెళ్తున్న క్రమంలో వాహనం అదుపు తప్పింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సాంబమూర్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
> భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలపై సమీక్ష సమావేశం
> ఖమ్మం జిల్లాలో బార్ అసోసియేషన్ ఎన్నికలు
> కొత్తగూడెంలో BJPఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పర్యటన
> ఎంపీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష
> అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
> కామేపల్లి మండలం తాళ్ల గూడెంలో తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం

News March 28, 2024

ఖమ్మం: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

image

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ, సూర్యాపేట, ఇల్లందు, కొత్తగూడెం సత్తుపల్లి ప్రయాణించాలంటే గంటల కొద్దీ బస్టాండ్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సుల సౌకర్యం కల్పించాలని పలువురు వేడుకుంటున్నారు.

News March 28, 2024

’18 నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోండి’

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అర్హులైన యువత ఏప్రిల్ 15లోగా ఓటర్లుగా పేరు నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఫారం-6లో వివరాలు నమోదు చేసి ఆన్లైన్ లేదా నేరుగా సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.