Khammam

News July 9, 2024

ఖమ్మం: జిల్లాలో సాగర్ కాలువలపై చోరీల కలకలం?

image

నాగార్జున సాగర్ ప్రధాన కాలువలపై ఉండే క్రాస్ రెగ్యులేటర్ల వద్ద షట్టర్లు ఎత్తేందుకు, దింపేందుకు ఉపయోగించే ఇత్తడి చక్రాలు చోరీకి గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు, తనికెళ్ల, ఏన్కూరు, కల్లూరు ప్రాంతాల్లో క్రాస్ రెగ్యులేటర్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అంతటా ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి.

News July 9, 2024

ఖమ్మం: TGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో RM సమావేశం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ అన్ని డిపోల ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్‌తో ఈరోజు సమావేశం నిర్వహించారు. డిపోలో ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రీజనల్ మేనేజర్‌కుTGSRTC ఎంప్లాయ్ వెల్ఫేర్ మెంబెర్స్ పూలబొకే అందజేశారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో త్వరలోనే ‘రైతు భరోసా’

image

వానాకాలం పంటల నుంచే కౌలు రైతులకూ పెట్టుబడి సాయమందిస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసింది. కౌలుదారులకు ‘రైతు భరోసా’పై మార్గదర్శకాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపింది. ఈమేరకు కౌలు రైతుల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

News July 9, 2024

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లు: మంత్రి

image

సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కోసం చైనా ఇంజనీర్లను రప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చైనా నుంచి ఇంజనీర్లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు తరలింపు పూర్తి చేస్తామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రాజెక్ట్ , లంకాసాగర్ సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటిని పంపిస్తామన్నారు.

News July 9, 2024

భద్రాద్రి: డెంగ్యూతో డాక్టర్ మృతి

image

డెంగ్యూ వ్యాధితో డాక్టర్ మృతి చెందిన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని పీవీ కాలనీకి చెందిన డాక్టర్ నాగవరపు దిలీప్ తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులుపరీక్షలు నిర్వహించగా డెంగ్యూ నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డాక్టర్ దిలీప్ మరణించారు.

News July 9, 2024

ఖమ్మం జిల్లాలో వరుస భూవివాదాలు

image

ఖమ్మం జిల్లాలో భూ వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు. భూ వివాదం పరిష్కారం గాక, భూమిని దున్నుకోలేక , ఇతరుల చెరలో ఉన్న భూమిని విడిపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటేనో లేదా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తప్ప పరిష్కార మార్గం దొరకదన్న భావన బలపడుతుండడం అత్యంత ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జిల్లాలో వరుస ఘటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై అధికారులు రైతంగానికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

News July 9, 2024

శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో డిప్యూటీ సీఎం

image

విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో డిప్యూటీ సీఎంకు మరియు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎ, మంత్రులను ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

News July 9, 2024

సీతమ్మ సాగర్‌ను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతమ్మ సాగర్ సాగునీటి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధం చేశారు. అలాగే ఆగస్టు 15న భద్రాద్రి జిల్లాలో రాజీవ్ కాలువను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

News July 9, 2024

ఖమ్మం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

image

ఖమ్మం జిల్లాలో పొద్దుటూరు, బాణాపురం ఘటనలు మరువక ముందే రఘునాథపాలెం మండలం రజాబ్ అలీ నగర్‌కు చెందిన మరో రైతు ప్రసాద్(32) ఆత్మహత్యాయత్నం చేశాడు. భూమి విషయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. తన భూమిని ఓ కానిస్టేబుల్ అతని కూతురి పేరుపై అక్రమంగా పట్టా చేయించాడని బాధితుడు వాపోయాడు.

News July 9, 2024

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు: ఎంపీ RRR

image

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. సోమవారం కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీలు, ఎయిర్ పోర్టు ప్రాధాన్యతగా తీసుకుని వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, పాలేరు రిజర్వాయర్‌ను వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా మార్చాలనే ఆలోచన ఉందని తెలిపారు.