India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ , డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా సజావుగా జరపాలన్నారు.
చర్ల సరిహద్దుకు ఆనుకుని ఉన్న సుకుమా జిల్లా కిస్టారం ఏరియా కమిటీకి చెందిన సోడి కొస, సోడి సుక్కి అనే మావోయిస్టు దంపతులు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ గతంలో పలు దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. సుక్కా అలియాస్ సోడి కోసపై రూ.5లక్షలు రివార్డు, సోడి సుక్కి మీద రూ.2 లక్షలు రివార్డు ఉంది.
ఖమ్మం: బీజేపీ అధిష్ఠానం విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్టులో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు అన్నారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు ఆగిందో పార్టీకే తెలియాలన్నారు. పాత బీజేపీ నేతలతో మాట్లాడే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ సీనియర్ నేతల సహకారం తనకే ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ సత్తా ఏంటో ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.
సత్తుపల్లిలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం పట్టణ శివారులోని వంతెన పైనుంచి వెళ్తుండగా అదుపుతప్పి తమ్మిలేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వాగులో పూర్తిగా మునిగిన డీసీఎంను పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈ రోజు మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని అధికారులు సూచించారు.
చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్‌లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.
✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓రెండవ రోజు కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
✓తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదు పై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ప్రిన్సిపల్, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్ విద్యార్థినులుండే హాస్టల్‌కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడికి చుక్కెదురైంది. ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ పోస్టుల్లో వైరాకు చెందిన బొర్రా రాజశేఖర్‌కు అవకాశం లభించలేదు. శ్రీనివాసరెడ్డి 2013లో వైసీపీలో చేరినప్పటి నుంచి అతని అనుచరుడుగా కొనసాగుతున్నారు. కార్పొరేషన్ పోస్టుల్లో అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు కార్పొరేషన్ పదవి లభించపోవడం వైరా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశనే మిగిల్చింది.
ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం. 2019లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఈసారి వీరి సంఖ్య 8,39,640కి పెరిగింది. పురుష ఓటర్లు 7,39,600 మంది నుంచి 7,84,043 మందికి చేరుకున్నారు. మహబూబాబాద్ స్థానంలో 2019లో 7,21,383 మంది మహిళా ఓటర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 7,81,339కి పెరిగింది. పురుష ఓటర్లు 7,01,921 మంది నుంచి 7,45,564 మందికి చేరారు.
Sorry, no posts matched your criteria.