India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం, భద్రాచలం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. సరీరామ్, భద్రాచలం డిఎం బి.రామారావు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు 19న రాత్రి బయలుదేరి 20వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని వెల్లడించారు. మార్గమధ్యలో విజయవాడ మీదుగా శ్రీకాళహస్తి, కానిపాకం, శ్రీపురం దర్శనం ఉంటుందని తెలిపారు.
కొత్తగూడెం సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, కార్మికుల పిల్లలకు జేఎన్టీయూ పరిధిలోని మంథని, కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. ప్రవేశలకు గత నెల 30 వరకు ఉన్న దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. దరఖాస్తులను 23వ తేదీలోగా కార్పొరేట్ కార్యాలయానికి పంపించాలని అధికారులు సూచించారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 20, 21 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సింగరేణిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.
రాత్రి వేళల్లో మద్యం తాగి పంట పొలాల్లో ఆ మద్యం బాటిళ్ళను పడేసే మందుబాబులు ఒక్కసారి ఆలోచించండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం గట్ల మధ్య మద్యం సేవించి వెళ్లే కొందరు యువకులు బాటిళ్ళను పొలం గట్లపై పగలగొడుతుండడంతో ఆ మద్యం బాటిళ్లు పంట పొలాల్లో పడి సేద్యం చేసే సమయంలో రైతన్నల కాళ్లకు గాయాలు అవుతున్నాయి. నిత్య కృత్యంగా మారిన ఈ పరిస్థితి పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం సీజన్లో తొలకరి జల్లులు పడుతున్నప్పుడు తండాల్లో లంబాడా గిరిజనులు జరుపుకునే మొదటి పండుగ సీత్లా పండుగ. కాగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల్లో మంగళవారం సీత్లా పండుగ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే తండాల్లో ఉన్న సీత్లా భవాని వద్ద గిరిజనులు తగు ఏర్పాట్లు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని లంబాడా గిరిజనులు ప్రతి ఏటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
భద్రాచలం పట్టణంలోని సోమవారం రాత్రి బ్రిడ్జిపై ఎక్సైజ్ ఎస్ఐ కారును మరొక కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఎక్సైజ్ ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్సైని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏన్కూరు మండలం హిమంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేలపై కూర్చొని విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
మధిర శివాలయం వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైరా నదిలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి మడుపల్లి గ్రామానికి ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా రోడ్డు కుంగి తూములో ఇరుక్కున్నాడు. దీంతో నీటి ప్రవాహానికి ఊపిరాడక అతడు మృతి చెందాడు. మృతుడు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామానికి చెందిన బోశెట్టి రమేష్గా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.