India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరివేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది. ములుగుమాడు గ్రామానికి చెందిన ఓ యువతీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరివేసుకుని ఉన్న యువతిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా యువతి ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డుల కోసం 35వేలు, కార్డుల్లో మార్పునకు 25,901 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 4,11,347 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 11,32,871గా ఉంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.6,950 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
గార్లలో విషాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ బజార్‌కు చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పాప మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వాంతులు, విరోచనాలతో రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బోనకల్‌లో చోటు చేసుకుంది. బోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన జమలయ్య, లావణ్య దంపతుల కుమారుడు భరత్(2)కు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు గ్రామంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి తెలిపారు. మొదటి పేపర్ జూలై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఇంజనీరింగ్ థ్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ సెట్ కౌన్సెలింగ్ ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనుండగా, 14వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 18న మొదటి విడత సీట్ల కేటాయింపు, 21వ తేదీన సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న 249మంది విద్యార్థుల్లో 235 మంది హాజరయ్యారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఐఈఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో చేరేందుకు డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామినేని సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని చెప్పారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్తగా మారనుంది. మార్కెట్‌కు నూతన హంగులు సంతరించుకోనున్నాయి. దేశంలోనే అధునాతన, మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు రూ.100కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2లక్షల బస్తాలు వచ్చినా ఇబ్బంది లేకుండా 17ఎకరాల విస్తీర్ణంలో 6 నుంచి 7 భారీ షెడ్ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర నిర్మాణాలకు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు.
రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలలు జిల్లా అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరమ్మతులు అవసరమున్న చోట వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు కారణంగా రెడ్ జోన్లో ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.