India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గార్ల మండలంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లెవెల్ బ్రిడ్జి నుంచి వరద ప్రభావం ఎక్కువ ఉండటంతో రాంపురం, మద్దివంచ మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు వాగు సమీపంలోకి ఎవరూ రాకూడదని అధికారులు సూచించారు.

కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇటీవల తల్లి సక్రిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు భీముడు ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. ఈనెల 15న కన్నతల్లి అయిన సక్రిని గుగులోత్ భీముడు కర్రతో కొట్టి హత్య చేశాడు. విచారణలో తల్లిని చంపిన వ్యక్తి బీముడు ను అదుపులో తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

జోన్ 4 పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పంచాయతీ కార్యదర్శుల బదిలీ లో ఈరోజు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు 10 మంది, మహబూబాబాద్ జిల్లాకు ఒకరు బదిలీపై వెళ్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ లో ఎవరు రావడం లేదని అధికారులు తెలియజేసారు.

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వెంకటాపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం ఆలుబాకకి చెందిన బానారి రాజు (45) ఈరోజు మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 87126 59111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చేసిందని ఆరోపించారు.

జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ఎస్హెచ్ఓ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ ఖమ్మంలో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్ఫోర్స్మెంట్ విభాగం 9,008 కిలోల గంజాయిని పట్టుకొంది. ఎన్ఫోర్స్మెంట్, రెండు జిల్లాల్లోని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు కేసులను ఆయా పరిధి స్టేషన్లలో నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్టేషన్లలో మూలుగుతున్న గంజాయి కలిసి స్టేషన్లలో కుప్పలు పేరుకుపోతున్నాయి.

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Sorry, no posts matched your criteria.