India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కూసుమంచి మండలంలోని మునిగేపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు గుర్తించిన పాద ముద్రలు చిరుత పులివి కావని అటవీ రేంజి అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో పాదముద్రలను గుర్తించిన కౌలు రైతు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. గ్రామ కార్యదర్శి నరేశ్ ద్వారా సమాచారం అందుకున్న రేంజర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ కి కావాల్సిన భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ఖమ్మం: గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం బోనకల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను సీపీ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.

అశ్వారావుపేట మండల పరిధిలోని పెద్దవాగు వరద పరిస్థితిపై గురువారం సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా పెద్ద వాగు వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సీఎస్ కు వివరించారు.

పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన రాష్ట్రంలోని ప్రతీ రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు.

తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్‌ను అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఖమ్మం నగరం-ఖమ్మం రూరల్ మండలాల మధ్య నాయుడుపేట సమీపాన మున్నేరుపై ఉన్న పాతవంతెన స్థానంలో నిర్మిస్తున్న తీగల వంతెన పనులు చకచకా సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు కాగా.. 700 మీటర్ల మేర తీగల వంతెన నిర్మిస్తారు. మిగతాది అప్రోచ్ వంతెన ఉండనుంది. నాలుగు నెలలు క్రితం పనులు మొదలు పెట్టగా ఇప్పటికే మున్నేరులో వంతెనకు అవసరమైన పిల్లర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోంది.

ఉమ్మడి ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోలకు త్వరలో 25 కొత్త బస్సులు రానున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ అన్నారు. ఎక్కువగా తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. రీజియన్‌లో ప్రతిరోజు 2.42 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సుల ద్వారా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు ఆయన చెప్పారు.

రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.908.27 కోట్ల మేర పంట రుణాలు మాఫీ అయ్యే అవకాశముంది. నాలుగు జిల్లాల్లో వ్యాపించి ఉన్న డీసీసీబీ పరిధిలోని 100 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న 1,69,864 మంది రైతులు అర్హత సాధించారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన 1,16,291 మంది రైతులకు రూ.647.76కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.
Sorry, no posts matched your criteria.