India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గురువారం ఉదయం గోదావరి వరద నీటిమట్టం 21 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఎక్కువ ఉండడంతో భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఎగువన భారీ వర్షాలు కురస్తుండడంతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతుంది. చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు 4 గేట్లు పూర్తిగా, 21 గేట్లు 2 అడుగులు మేర ఎత్తివేయడంతో 68 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తారు.

డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఖమ్మం జిల్లాలోని ఆరు ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు షిఫ్ట్ లో పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. మొత్తం 25,204మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

వర్షాకాలం ప్రారంభమవడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడంతో ఖమ్మం జిల్లా ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడి మంచం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడటంతో ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు 18 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసే దివ్యాంగుల కోసం అధికారులు ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే డీఈఓ కార్యాలయ సీఎంఓ రాజశేఖర్‌ను ఇన్ఛార్జిగా నియమించారు. 137మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు.
వీరికి సహాయకుల (స్క్రైబ్స్)ను అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యార్థులను
జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా నియమించింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో డీఈఓ సోమశేఖరశర్మ, భద్రాద్రి కొత్తగూడెంలో డీఈఓ వెంకటేశ్వరాచారి పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు డీఈఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఖమ్మం 99512 12603, భద్రాద్రి జిల్లా అభ్యర్థులు 98857 57137కు సంప్రదించాలన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుల బదిలీని నిలిపి వేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ అర్చకులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ జీవో విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ఆలయ ఉప ప్రధానార్చకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణ చార్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో భద్రాద్రి ఆలయ అర్చకుల బదిలీని నిలిపివేస్తూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.

ఖమ్మం జిల్లాలో గుట్కా దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ జోరుగా వ్యాపారం సాగుతున్నట్లు అంటున్నారు. టాస్క్ఫోర్స్ దాడులు కొనసాగుతున్నా.. అమ్మకాలు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. దీంతో దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందన్నారు. గుట్కా మాఫియాపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలలో రైతుల సంబరాలు
✓పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుక చౌదరి పర్యటన
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులు రూ.4,307.58 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 1,85,034 మంది రైతులు రూ.1,816.35 కోట్ల రుణాలు పొందారు. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను గురువారం ప్రదర్శిస్తారు. తొలిదఫాలో ఖమ్మం జిల్లాలో 57,857 మందికి, భద్రాద్రి కొత్తగూడెంలో 28,018 మంది కర్షకులకు రుణ విముక్తి కలగనుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.