India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యా సంవత్సరం(2025- 26) ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రధానాచార్యుడు నర్సింహులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. సెప్టెంబరు 16లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

ధంసలాపురం వద్ద ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఎంట్రీ ఎగ్జిట్‌పై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ ఇతర అధికారులతో డిజైన్స్‌పై చర్చ జరిపారు. ఈ చర్చలో మంత్రికి రెండు డిజైన్లను అధికారులు సమర్పించారు. రైతులు నష్టపోకుండా తక్కువ భూసేకరణ ఉండే డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ ఆమోదించాలని మంత్రి సూచించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం మధ్యాహ్నం 16 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఏడు గంటలకు 18.5 అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తి వేయడంతో భద్రాద్రి వద్ద గోదావరి గురువారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన కారణంగా ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి వీలుగా డిపోలకు చెందిన నంబర్లలో సంప్రదించాల్సిందిగా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఒక ప్రకటనలో ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం 99592 25979, మధిర 73829 25289, సత్తుపల్లి 9959 225990, భద్రాచలం 9959 225987, కొత్తగూడెం 9959 225982, మణుగూరు 89853 61796 సంప్రదించాలన్నారు.

రైతు రుణమాఫీపై సందేహాలున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేవంటూనే ఉత్తర్వులను సవరించడం లేదని మండిపడ్డారు. రైతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే DSC పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS చట్టం అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 తేదీ నుంచి ప్రతి రోజు 163 ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని ఎర్రుపాలెం, తొండల గోపవరం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌పై 35 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (s) మండలం బొప్పారంలో ఈతకు వెళ్లి ఖమ్మం జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం అశ్వారావుపేట, జూపేడ గ్రామానికి చెందిన శావల్య రాజు (45) అతడి కూతురు శ్రావల్య ఉష (12), శ్రీపాల్ రెడ్డి (40 ) హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఓ శుభకార్యానికి వచ్చి క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నీట మునిగి మృత్యువాత పడ్డారు.

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.