Khammam

News July 17, 2024

సుప్రీం తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు: మాజీ మంత్రి సత్యవతి

image

మిద్యుత్ కమిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌పై ఏదో ఒకటి ఆపాదించాలనే కుట్రకోణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియల కనిపిస్తుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెసే కమిషన్లు కక్ష సాధింపుల కోసమేనని అన్నారు. రేవంత్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 

News July 17, 2024

సింగరేణి బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

image

సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి … రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.

News July 17, 2024

కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీస్

image

బయ్యారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కల్పనాదేవికి రామారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని 9 ,10 తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు ఉండగా, మాజీ సీఎం ఫొటోతో ఉన్న పాఠ్యపుస్తకాలను స్పెషల్ ఆఫీసర్ పంపిణీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీసు జారీచేశారు.

News July 17, 2024

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న బహుళవిధ కార్మికుల నిరీక్షణకు తెరపడింది. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. కార్మికుల ఖాతాల్లో సత్వరం జమచేయాలని అధికారులను ఆదేశించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లోని 1,070 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న 2,346 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.8.98 కోట్లు అందనున్నాయి.

News July 17, 2024

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదయింది. పోలీసుల వివరాలు..ఖానాపురానికి చెందిన 9వతరగతి బాలిక ఖమ్మంకు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఇంటికి వెళ్లిన తరువాత గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాను తెలిపారు.

News July 17, 2024

తల్లిదండ్రులు మందలించారని బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. గుండాల మండలం సాయనపల్లికి చెందిన రమ్య గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఇటీవల ఇంటికి వచ్చిన రమ్యను మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించారు. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

News July 17, 2024

పాలేరు అభ్యర్థులకు నోటీసులు

image

అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు
నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో వ్యయ వివరాలు వెల్లడించని ఇద్దరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల నియామవళి ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారానికి వెచ్చించిన ప్రతీ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కానీ పాలేరులో రామిరెడ్డి సుంకిరెడ్డి, రామసహాయం మాధవీరెడ్డి వివరాలు సమర్పించకపోవడంతో నోటీసులు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు.

News July 17, 2024

‘ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయి’

image

ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయని ఖమ్మం ఆదాయపన్ను అధికారి ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీడీవోలకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై ఆదాయపన్ను అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయపన్ను ముఖ్య ఆదాయ వనరులని, ఆదాయపన్ను క్రింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందన్నారు.

News July 16, 2024

ఖమ్మం: వృద్ధురాలి హత్య

image

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యతండాకు చెందిన సక్రి(65)ని దుండగులు హత్య చేశారు. స్థానికుల వివరాలిలా.. సక్రి రోజూ పనికి వెళ్తుంటుంది. ఇవాళ ఇంటి నుంచి బయటకు రాలేదు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

News July 16, 2024

ఖమ్మంలో అమ్మమ్మపై మనవడి హత్యాచారం

image

ఖమ్మంలో దారుణం జరిగింది. అమ్మమ్మపై మనవడు హత్యాచారం చేశాడు. స్థానికుల వివరాలు. ఉదయ్(24) తన అమ్మమ్మ రాంబాయి(80) వద్ద ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఉదయ్ ఆమెను మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై హత్యాచారం చేశాడు. స్థానికులు నిందితుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.