India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO భాస్కర్ నాయక్ అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సరైన కారణం లేకుండా అబార్షన్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ ఎదుట రూ.20 లక్షల రివార్డ్ కలిగిన నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు(బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మొహర్రం, తొలి ఏకాదశి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామన్నారు. తిరిగి గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని పేర్కొన్నారు.

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి అమ్మమ్మను మనుమడు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. దురలవాట్లకు బానిసైన అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మణుగూరు మండలంలోని రాజీవ్ గాంధీనగర్‌లో మూడు నెలల చిన్నారి నిద్రలోనే మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకొంది. ఇస్మాయిల్, నసీమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెను తన వద్దనే ఉంచుకొని తల్లి నిద్రించింది. ఉదయం లేచి చూసేసరికి చిన్నారి శరీరం కమిలి పోయి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.

కడుపునొప్పి తాళలేక విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోనకల్ మండల పరిధిలోనే రావినూతలలో జరిగింది. ఎస్సై కడగండ్ల మధుబాబు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి అచ్యుతరావు, నాగేంద్ర దంపతుల పెద్ద కుమార్తె రిషిత (16) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుందన్నారు. ఈ క్రమంలో కడుపు నొప్పి తాళలేక సోమవారం ఇంట్లో పురుగు మందు తాగి మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓ ఖమ్మంకి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రాక
✓ మధిరలో సిపిఎం రాజకీయ శిక్షణ కార్యక్రమం
✓ నేలకొండపల్లిలో రైతులతో శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్

కొత్తగూడెం బూడిదగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న తుమ్మ పద్మావతిని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సస్పెండ్ చేశారు. రామచంద్రఎయిడెడ్ పాఠశాల ప్రవేశాలు లేకపోవటంతో 2018లో మూతపడింది. ఆ పాఠశాలలో 2004-14మధ్యకాలంలో పద్మావతి HMగా పనిచేశారు. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని అప్పటి కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు రాగా.. ఆయన విచారణకు ఆదేశించారు. గత నెలలో నివేదిక సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్, పద్మావతిని సస్పెండ్ చేశారు.

ఖమ్మం: డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార వ్యవస్థను మరింత భలోపేతం చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణపై ఈ బృందాలు నిరంతరం పనిచేస్తాయని చెప్పారు. డ్రగ్స్, గంజాయి సమాచారంపై 8712659123 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వెంటనే దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దని, ఏ వారం దరఖాస్తులను ఆవారమే పరిష్కరించాలని సూచించారు. బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.