India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఖమ్మం డివిజన్‌లో 137 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ నందు రైతు భరోసా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందో రైతులే చెప్పాలన్నారు. రైతులు సూచించిన మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

మణుగూరు ఏరియా సింగరేణి పాఠశాలలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇటీవల వే2న్యూస్‌లో కథనం ప్రచురించారు. స్పందించిన సింగరేణి అధికారులు సింగరేణి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న, విద్యార్థుల సౌకర్యార్థం మూడు బస్సులను సోమవారం ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించిన వే2న్యూస్, సింగరేణి అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సోమవారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గ్రామంలో 100 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. పారిశుద్ధ్య లోపమే కారణమని స్థానికులు అంటున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్న వారిలో ఇప్పటి వరకు 9 మందికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కాగా, ఆదివారం తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన ఆదివారం వైరాలో జరిగింది. భద్రాచలం నుంచి ఖమ్మంకు వస్తున్న ఆర్టీసీ బస్సులో సుజాతనగర్ వద్ద అరుణ ఆమె భర్త ఎక్కారు. ఈ క్రమంలో భర్త వైరాలో దిగిపోయాడు. వీరిద్దరి టికెట్ భర్త వద్దే ఉండిపోవడంతో టికెట్ ఉండాలని అరుణకు కండక్టర్ సూచించారు. దీంతో క్షణికావేశంతో అరుణ కండక్టర్‌పై దాడి చేసి దుర్భాషలాడింది. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 16న ఖమ్మానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ (మామిళ్లగూడెం) నందు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

రఘునాథపాలెం: హర్యాతండ వద్ద మే 28న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం ACP రమణమూర్తి వివరాలు వెల్లడించారు. బాబాజీతండాకు చెందిన నేరస్తుడు బోడ ప్రవీణ్ HYDలో వైద్యుడిగా పని చేస్తూ కేరళకు చెందిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరి అక్రమ సంబంధానికి భార్య పిల్లలు అడ్డు వస్తున్నారన్న నేపంతో భార్య పిల్లలను హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించాడని పేర్కొన్నారు.

పాలేరు జలాశయంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్, అతని రెండేళ్ల కూతురి ప్రాణాలను కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ బ్రహ్మం కాపాడాడు. జీళ్ళచెరువుకు చెందిన జంపాల నరేశ్ అతని భార్య గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురై నరేశ్ కూతురితో పాలేరు జలాశయం వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 100కు డయల్ చేసి చెప్పాడు. పోలీసులు వెంటనే వెళ్లి కాపాడారు.
Sorry, no posts matched your criteria.