Khammam

News July 14, 2024

భద్రాచలం రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 14, 2024

వాజేడు: జలపాతం వద్ద హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు

image

వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జలపాతం సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో ప్లెక్సీలతో సూచనలు చేశారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది బొగత జలపాతం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.

News July 14, 2024

ఖమ్మం జిల్లాలో హీరోయిన్

image

ఖమ్మం జిల్లాలో హీరోయిన్ సంయుక్త మేనన్ సందడి చేశారు. శనివారం ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

News July 14, 2024

ఖమ్మం: ఖానాపురం హవేలి PSలో మహిళ హల్‌చల్‌

image

ఖానాపురం హవేలి PSలో ఓ వివాహిత శనివారం హల్‌చల్‌ చేసింది. AR కానిస్టేబుల్‌‌తో తన భార్యకు సంబంధం ఉందని ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా యువతిని స్టేషన్‌కు పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించింది. కానిస్టేబుల్‌తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్‌ చేశారంటూ గొడవకు దిగింది. పెట్రోలు పట్టుకుని వచ్చి బెదిరించింది.

News July 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
> కొత్తగూడెంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> సత్తుపల్లి సింగరేణి ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం
> నేలకొండపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
> బయ్యారంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సమ్మేళనం
> మధిరలో సీపీఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 14, 2024

ఆ వార్తలు అవాస్తవం: ఎంపీ రవిచంద్ర

image

ఖమ్మం: బీఆర్ఎస్‌ని బీజేపీ పార్టీలో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఇటువంటి వార్తలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలో కలుస్తుందన్న వార్తలు ఊహాజనితమైనవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. 

News July 13, 2024

KMM: నిధులు లేక పడకేసిన పంచాయితీ పాలన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

News July 13, 2024

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అక్రమంగా డబల్ పెన్షన్లు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకుంటున్న వారిని అధికారులు గుర్తించారు. ఇటీవల చేపట్టిన సర్వేలో డబల్ పెన్షన్ తీసుకుంటున్న 427 మందిని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఖజానాను గండి కొడుతూ అక్రమంగా డబల్ పెన్షన్లు తీసుకున్న వారు నగదును తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అనర్హుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.

News July 13, 2024

స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. పురిటిలో శిశువు మృతి

image

స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంతో ఓ గర్భిణి పురిటిలో శిశుమృతి చెందిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. మల్లారంకి చెందిన గర్భిణి లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం PHCకి భర్త తీసుకెళ్లాడు. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌ను డెలివరీ చేయాలని భర్త కోరారు. దీంతో నర్సు సెల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించింది. శిశువు కడుపులో ఉమ్మ నీరుతాగి మరణించింది.

News July 13, 2024

భద్రాచలం వంతెనకు 60 సంవత్సరాలు

image

భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పాత వంతెన నేటితో 59 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని 60వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ వంతెనను 1965 జులై 13న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1959లో శంకుస్థాపన చేయగా రూ.70 లక్షల వ్యయంతో ముంబైకి చెందిన పటేల్ ఇంజినీరింగ్ కంపెనీ 1965లో పూర్తి చేసింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.