India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తరపున కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు, స్వామివారికి ఇష్టమైన వడమాల అప్పాల మాలలను భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి గురువారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపంలో కర్లపూడి నాగభూషణం(58) అనే విశ్రాంత ఎస్టీవో ఉద్యోగి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్వస్థలం ఖమ్మం బీకే బజార్. కొంతకాలంగా నాగభూషణం క్యాన్సర్ బాధపడుతున్నాడు. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో ఓ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కీమోథెరపి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రాముడి తరఫున కానుక అందించేందుకు చర్యలు చేపట్టారు. జూన్ 1న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రామబంటు ఆంజనేయుడికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను అందించేందుకు ఈఓ రమాదేవి కొండగట్టు వెళ్లినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. హనుమాన్ జయంతికి పట్టు వస్త్రాలను అందించడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది.
మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ జరిగి B TECH విద్యార్థి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. కూలి లైన్‌కు చెందిన గుణదీప్(21) HYDలో B TECH చేస్తున్నాడు. సెలవులకు కొత్తగూడెం రాగా.. ఖమ్మం బస్ స్టాప్ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఘర్షణలో మరో యువకుడు గుణదీప్‌ను ఛాతిపై కొట్టడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు పరారిలో ఉన్నాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 1962, 102 వాహనాల పైలట్ (డ్రైవర్) ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 31న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
అడ్డా మీద కూలీ పనికి వెళ్తున్న ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన రజబెల్లి (55) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు ఇష్టూ జిల్లా అధ్యక్షుడు యాకుబ్ షావలి బుధవారం తెలిపారు. 30 ఏళ్లుగా బొగ్గు కాటా వద్ద పనిచేస్తున్న రజబెల్లి ఏడాదిగా బొగ్గు లేకపోవటం వల్ల కుటుంబాన్ని పోషించుకునేందుకు అడ్డా మీద కూలీకి వెళ్తున్నాడని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
పట్టభద్రుల MLC ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్ధులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ వర్షాకాలంలో 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశామని, ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 4,49,347 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, బుధవారం నాటికి 34 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించామని వివరించారు. అందరికీ సరిపడా విత్తనాలు సమకూరుస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో పంపిస్తామని తెలిపారు.
రఘునాథపాలెం మండలం బాబోజితండాకు చెందిన ప్రవీణ్, భార్య కుమారి(25), పిల్లలు కృషిక (5), తనిష్క(3) కారులో వెళ్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టిన విషయం విదితమే. ప్రవీణ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ కూతురు, మనవరాళ్లను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే నిజనిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.