Khammam

News May 29, 2024

KMM: అదేరోజు బాలిక, మంగళవారం యువకుడు మృతి

image

ఇటీవల ఓ మైనర్ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవులుకు ఫోన్ కాల్‌లో ఖమ్మంకు చెందిన సుష్మతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 24న వరంగల్ 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేయగా.. సుష్మ(17) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News May 29, 2024

ఖమ్మం: ఉమ్మడి జిల్లాల్లో 100 పోస్టాఫీసుల్లో మాత్రమే ఈ సేవలు

image

ఖమ్మం రీజియన్ పరిధిలో 825 పోస్టాఫీసులు ఉన్నా కేవలం 100 తపాలా కార్యాలయాల్లో మాత్రమే ఆధార్ నమోదు సేవలు అందుతున్నాయి. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ఆధార్ నమోదు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఖమ్మం జిల్లాలో 60 మంది, భద్రాద్రి జిల్లాలో 40 మంది ఉత్తీర్ణులయ్యారు. అందుకే 100 మాత్రమే ఈ సేవలందిస్తున్నారు.

News May 29, 2024

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన పి.నాని(19) హైదరాబాద్‌లోని TVS సంస్థలో సర్వీస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పని నిమిత్తం బైక్‌పై పెద్దపల్లికి వెళ్లి తిరిగి కరీంనగర్‌కు వస్తుండగా ముగ్దుంపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు.

News May 29, 2024

ఖమ్మం: గ్రూప్‌-2, సింగరేణి ఉద్యోగాలంటూ..రూ.4కోట్ల మోసం

image

గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్‌‌కమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్‌ చుంచుపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పానని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఈ స్కామ్‌లో హరికిషన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

News May 29, 2024

KMM: 1.27 లక్షల మంది ఓటు వేయలేదు!

image

WGL-KMM-NLG పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. 1.27 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.05 లక్షల ఓట్లకు గానూ 3.85 లక్షల మంది ఓటర్లు ఓటేయగా..1.19 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 4.63 లక్షల ఓట్లకు గానూ 3.36 ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారికి సంఖ్య 8వేలకు పెరిగింది.

News May 29, 2024

ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

image

జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

ఖమ్మం: ఘోర రోడ్డుప్రమాదం.. తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి

image

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. రఘునాథపాలెం మండలం హర్యాతండా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఖమ్మం జిల్లా బావోజీ తండా వాసులుగా గుర్తించారు.

News May 28, 2024

KTDM: మందుపాతర అమరుస్తున్న మావోయిస్టులు అరెస్ట్

image

చర్ల సరిహద్దు ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లా గిర్సపా అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమరుస్తున్న 15 మంది మావోయిస్టులను డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరి వద్దనుండి ఒక మందు పాతర, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్, ఒక టిఫిన్ బాక్స్ మావోయిస్ట్ సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News May 28, 2024

BREAKING.. ఖమ్మం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

image

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైరా మండలం నారపునేనిపల్లిరీ చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్ష(22) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, అమెరికాలో సాఫ్ట్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో వర్షకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వర్ష మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 28, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక నుండి ‘అభా’ సేవలు

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారు ఇక వేచి ఉండాల్సిన పని లేదు. ఓపీ చీటీ కోసం గంటలకొద్ది క్యూలో నిలబడాల్సిన బాధ తప్పినట్లే. ప్రభుత్వాస్పత్రుల్లో సత్వర సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) యాప్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని ఖమ్మం జనరల్ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.