India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హోలీ జరుపుకున్న ఆ కుటుంబంలో గంటల వ్యవధిలోనే విషాదం నెలకొంది. సింగరాయపాలెంకు చెందిన రాజశేఖర్, గీత(25) దంపతులు ఖమ్మంలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా రాజశేఖర్ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారు ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సింగరాయపాలెం వచ్చారు. ఈ క్రమంలో ఉతికిన బట్టలను గీత దండెంపై ఆరవేస్తుండగా తీగకు కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓నేలకొండపల్లిలో రైతు నేస్తం కార్యక్రమం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభo
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వరావుపేటలో ఎమ్మెల్యే పర్యటన
✓సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పర్యటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని క్రీడాపాఠశాలల్లో విద్యార్థుల ఎంపికకు మంగళ, బుధవారాల్లో తుది పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు తెలిపారు. కిన్నెరసానిలోని బాలుర, కాచనపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు 26, 27వ తేదీల్లో చివరి దశ పోటీలు నిర్వహించనున్నారు.
ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను పాఠశాల యజమాన్యం తమ ఇళ్లకు పంపించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏడుగురు సోమవారం అర్ధరాత్రి విద్యాలయలోని సీసీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డారు. బయటి వారు చేశారని తొలుత పోలీసులను ఆశ్రయించామని, విద్యార్థులే అని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ‘గృహజ్యోతి’కి అర్హులైన వేలాది మందికి ప్రస్తుతం జీరో బిల్లులు రావడం లేదు. ఇలాంటి వారంతా స్థానిక పురపాలక, ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆధార్, రేషన్, విద్యుత్తు బిల్లుకు సంబంధించి పత్రాలు అందజేస్తే పథకం వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 4,942, ఖమ్మం జిల్లాలో 3,568 మంది పథకానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
ఖమ్మం: ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సి- విజిల్ చురుకైన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి. వి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం సి-విజిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించిందన్నారు. సి- విజిల్ అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్, పౌరులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో ఈనెల 27న, భద్రాచలం దేవస్థానంలో ఈనెల 28న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి హుండీ, లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, దేవస్థాన అధికారులు, పోలీస్ శాఖ అధికారులు గమనించాలని తెలియజేశారు.
మూడు రోజుల విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
పాలేరు రిజర్వాయర్లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15 టీఎంసీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులను పాలేరు రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారని విద్యాసాగర్ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సారి ఖమ్మం స్థానం బీజేపీ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.