India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం ఆలయంలో మరోసారి వివాదం మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రవర మార్చి చదివారని అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో అర్చకులకు, వేద పండితులకు ఈవో మెమోలు జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రవర పఠించే సమయంలో శ్రీరాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈనెల 13న ముగిసింది. పోలింగ్ జరిగి నేటికీ 13 రోజులు కావస్తుండగా ఫలితాలు మరో 9 రోజుల్లో జూన్ 4న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తామే గెలుస్తున్నామన్న ధీమాలో ఉన్నారు. ఖమ్మం నుంచి ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతారో తెలియాలంటే మరో 9 రోజులు ఆగాల్సిందే. మరి గెలిచేదెవరో మీ కామెంట్!
2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
భద్రాచలానికి చెందిన బాలుడు హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ITCలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం.వెంకటగోపి కుటుంబీకులతో HYD కూకట్‌పల్లిలో ఓ గృహ ప్రవేశానికి వచ్చారు. శనివారం స్వర్ణగిరి ఆలయానికి కారులో బయల్దేరారు. మార్గమధ్యలో వేదశ్రీ, పూజిత్‌రామ్‌కు వాంతులు కావడంతో కారు పక్కకు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ కొడుకు పూజిత్‌రామ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడికక్కడే మృతిచెందాడు.
శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక కోసం స్థానిక ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. రూట్ల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటుచేసిన టేబుళ్లు, టేబుళ్లపై పోలింగ్ కేంద్రాల సంఖ్య, పోలింగ్ సిబ్బందికి చేపట్టాల్సిన వసతులపై చర్చించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం సీతరాముల నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ తలుపులు తీసి రామయ్యకు సుప్రభాత సేవ నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ఆరాధన, సేవకాలం, నిత్య బలిహరణ మొదలగు నిత్య పూజ కార్యక్రమాలు జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణ వైభవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
భద్రాచలం మారుతి కాలేజ్‌లో కారుణ్య మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి కారుణ్య తల్లిదండ్రుల కీలక ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తమ కూతురు మరణానికి, మారుతీ కాలేజ్ నర్సింగ్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని ఆ లెటర్‌లో పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీష్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీష్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం సారథినగర్‌కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కిందపడ్డారు. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతిచెందగా యువకుడి కాలు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.
WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.
Sorry, no posts matched your criteria.