India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. దమ్మపేట పట్వారిగూడెం కూడలి వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టడంతో కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కొన్ని గంటలకు ముందు పట్వారిగూడెంలో బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందిన రెడ్డిమల్ల యమున తెలంగాణ ఈసెట్‌లో ‘ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్’ విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. పదో తరగతి వరకు చేగొమ్మలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదువుకుంది. కోక్యాతండాకు చెందిన తేజావత్ లక్ష్మణ్(ప్రభుత్వ టీచర్) – కవిత దంపతుల కుమారుడు సాత్విక్ సోమవారం వెలువడిన ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనరల్ కేటగిరీలో మూడోర్యాంకు సాధించాడు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిధిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రముఖ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.
గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కొద్ది రోజుల నుంచి ఆనపబుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. పర్యటనలకు ఎటువెళ్లినా తన వాహనంలో దీనికి చోటు కల్పిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నప్పుడూ ఇందులో నీటినే తాగుతున్నారు. పీవో గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తుండటం విశేషం. ఆనపబుర్రలను ఆదివాసీలు ఇటీవల పీఓకు అందించినట్లు గిరిజన మ్యూజియం ఇంఛార్జి వీరాస్వామి మంగళవారం తెలిపారు.
సత్తుపల్లిలో 11 నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతోంది. పాల్వంచకు చెందిన జంపన్న-దుర్గ దంపతులు సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో గుడారం ఏర్పరచుకొని నివాసముంటున్నారు. కాగా రాత్రి నిద్రించే సమయంలో గుర్తుతెలియని దుండగులు వారి 11 నెలల బాలుడిని అపహరించారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూడగా బాలుడు కనిపించకపోవడంతో పలుచోట్ల వెతికిన కూడా ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
తల్లాడ మండలం గోపాల పేటలో ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వెంకటేశ్వర్లుతో పాటు ఆయనను హత్యలకు ప్రేరేపించిన రెండో భార్య త్రివేణిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
✓వివిధ శాఖలపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం ✓ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ✓ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా ఎస్పీ అధికారులతో సమావేశం ✓పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ✓సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ✓ఖమ్మం నగరంలో ఎంపీ వద్దిరాజు పర్యటన
వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు, సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగులు, పిల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఎన్నికల కోడ్ పూర్తైన వెంటనే దీనిపై న నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.