India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు, సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగులు, పిల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఎన్నికల కోడ్ పూర్తైన వెంటనే దీనిపై న నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు మే 23న భద్రాచలం గిరిజన గురుకుల స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ గ్రూపులలో మిగిలిన సీట్లభర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులెవరూ నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని సూచించారు. త్వరలో స్కూళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని వాటి కోసం ముందస్తుగానే రూ.120కోట్లు కేటాయించామన్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగూడెంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండే రెండు ప్రధాన కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చెప్పుకోలేకపోవటం ఒక కారణమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన రెండో తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవాలు జరపరాదని కూనవరం SI శ్రీనివాస్ సూచించారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని, పెట్రోల్, డీజిల్ బాటిల్స్ అమ్మకాలు నిషేధం అన్నారు.
ఖమ్మం-శ్రీకాకుళం మధ్య సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు DM యు.రాజ్యలక్ష్మి తెలిపారు. 9937 సర్వీస్ నెంబర్ గల బస్సు ఖమ్మంలో 6:15 బయలుదేరుతుందన్నారు. 9938 సర్వీస్ నెంబర్ గల బస్సు శ్రీకాకుళంలో 4:00 స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 99592 25990 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట భీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తుండగా ప్రతి ఏడాది ఏదో విధంగా పంటలు నష్టపోతున్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట భీమా పథకం అమలు చేస్తోంది.
Sorry, no posts matched your criteria.