Khammam

News May 20, 2024

ఖమ్మం జిల్లాలో భూసార పరీక్షల ఊసే లేదు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం భూసార పరీక్షల కోసం ప్రభుత్వం ప్రధాన ల్యాబ్లకు రూ.7.2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. గతంలో వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒకటి చొప్పున సేకరించి పరీక్షలకు పంపించే వారు. ఈసారి ఎంపికైన మండలాల్లో కొద్దిమంది భూముల నుంచే నమూనాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఏఈఓలు మట్టి నమూనాలను సేకరించే పనిలో ఉండగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

News May 20, 2024

నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు చేరుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇల్లందు సింగరేణి జేకే గ్రౌండ్లో జరిగే పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.

News May 20, 2024

ఖమ్మం: ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని విద్యార్థిని సూసైడ్

image

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.

News May 20, 2024

బడి తెరిచిన వెంటనే బుక్స్ ఇవ్వాలని..

image

పాఠశాలలు తెరిచిలోగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు 6,84,274 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికే 2 లక్షల వరకు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. బడి తెరిచిన మొదటి రోజే వాటిని విద్యార్థులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.

News May 20, 2024

KMM: మరో 14 రోజులే.. మీ MP ఎవరు..?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 14 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..

News May 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమావేశం
∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 20, 2024

ఖమ్మం: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

image

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.

News May 19, 2024

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల సమావేశంలో ఆయన పాల్గొనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.

News May 19, 2024

ఖమ్మం జిల్లా అంతటా అదే చర్చ!

image

ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెడుతున్నారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.