India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెడుతున్నారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 5,477 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై 2024, ఆగస్టు 1వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండినవారు అర్హులని తెలిపారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మొత్తం 52 మంది పట్టభద్రులు బరిలో నిలవగా ప్రధానంగా మూడు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఈ సీటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేయకుండా ఆపేశారు. జిల్లాలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.
మెగా ఫుడ్ పార్క్ ఖమ్మంలోని బుగ్గపాడులో వచ్చే నెలలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ముడి వనరులు పుష్కలంగా లభించడం. ఇప్పటికే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 203 ఎకరాల్లో జామ, మామిడి, జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్, సపోటా, నిమ్మ, మొక్కజొన్న పంటలను సాగు చేసేలా రైతుల్ని అధికారులు ప్రోత్సహించారు. అంతేగాక ఫుడ్‌పార్క్‌కు రవాణా సదుపాయాలు చేరువుగా ఉండడం.
టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హీరో జూనియర్ NTRను కలవాలనే కోరికతో ఓ అభిమాని పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్‌కు వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు చెప్పుల్లేకుండా 300 కిలోమీటర్లు నడిచాడు. తనను చూసేందుకు ఎంతో శ్రమించి ఇంటికి వచ్చిన నాగేంద్రను కలిసిన ఎన్టీఆర్ అతడితో ఫొటో దిగాడు. అభిమాన హీరో కలవడంతో అతడు తెగ సంబరపడుతున్నాడు.
KMM-NLG-WGL పట్టభద్రుల MLC స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడూ BJPని ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మల్లన్నను గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ తెలిపారు.
2024-25 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనానికి మే 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్ స్థాయి పీహెచ్‌డీ పోస్ట్, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం నందు చదవాలనుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు.
Sorry, no posts matched your criteria.