India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక సాంకేతికత పనులు సాగుతున్నాయి. త్వరలో సాఫ్ట్‌వేర్ పనులను పూర్తిచేసి ట్రయల్ రన్ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈఎం బ్రేక్స్ వంటి పనులను అధికారులు పూర్తిచేశారు. ఈ లోగానే మెయింటెనెన్స్ , ఇతర మెకానికల్ పనులు ముగిస్తామని తెలిపారు.
కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డులో ప్రయాణం చేస్తున్న సదరు మహిళ ఫుట్ బోర్డు నుంచి జారి అదే బస్సు వెనక టైర్ కిందపడి దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 4,61,806. పోలింగ్‌కు ఎనిమిది రోజులే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను చంపేశాడు. మృతులు తల్లి పిచ్చిమ్మ(60), కుమార్తెలు నీరజ (10), ఝాన్సీ (6). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెం పట్టణంలో జడ్పీ సర్వసభ్య సమావేశం
∆} వివిధ శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} జూలూరుపాడు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పునిచ్చారు. అశ్వాపురం మండలానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి నివసిస్తుంది. 2021 డిసెంబర్ 30న మహిళ ఇంట్లో లేని సమయంలో ఇంటి పక్కనే ఉన్న సాంబశివరావు అనే వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు విచారించి శిక్ష విధించారు.
కామేపల్లి మండల పరిధిలోని పింజరమడుగు పొన్నెకల్లు రెవెన్యూ గ్రామాలకు ఆనుకుని ఉన్న బుగ్గవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రి ఇల్లందు కారేపల్లి కామేపల్లి మండలాలలో భారీగా కురిసిన వర్షాలకు బుగ్గవాగు ఉగ్రరూపం దాల్చి భీకరంగా ప్రవహిస్తుంది. బుగ్గవాగు ఉధృతితో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మేకలకు తాగునీరు దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడింది.
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గ్రామస్థులు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ డోలిలో అంబులెన్స్ వద్దకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఘటన కుక్కునూరు మండలంలోని లచ్చి పేట గ్రామంలో జరిగింది. లచ్చిపేట గ్రామానికి చెందిన కోసి అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 అంబులెన్స్‌కు ఆ గ్రామం చేరుకునే దారి లేకపోవడంతో గ్రామస్థులు డోలీలో మహిళను అంబులెన్స్ వరకు తరలించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుగ్గపాడులో త్వరలోనే పరిశ్రమల స్థాపన, వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఖమ్మం మార్కెట్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఖమ్మం: స్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.
Sorry, no posts matched your criteria.