India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఆదివారం పోలీసు కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా, 83318 51510 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చని తెలిపారు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందు రోజే చూసుకోవాలన్నారు.
సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎండీ. సమీర్ (22) శనివారం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని కమిషనర్ సునీల్ దత్ ప్రకటించారు. ఆంక్షలు అమలులో వున్నందున పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్ బంద్ చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు రాయడానికి హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. కాబట్టి వాహనదారులను ఎవరైనా విద్యార్థులు లిఫ్ట్ అడిగితే దయచేసి వారికి లిఫ్ట్ ఇచ్చి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరేందుకు సహకరించండి. >>>SHARE IT
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కాగా, త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.
ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.