India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం: ఇళ్లు లేని వారికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన అన్నారు. సోమవారం గృహనిర్మాణాలపై సంబంధింత అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు.

ఖమ్మం: తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అభయహస్తం అందించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను పోలీస్ కమిషనర్ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నెల పాటు జరిగే కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలన్నారు.

మధిర: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హౌజింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు.

ఖమ్మం: రిటైర్మెంట్ వృత్తికే కానీ వ్యక్తిత్వానికి కాదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులను సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించి ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలన్నారు.

భారజలం ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే మణుగూరు భారజల కర్మాగారం ప్రత్యేక గుర్తింపు కలిగి తలమానికంగా నిలుస్తోంది. భారజల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న అక్సిజన్-18 ఎన్ రీచ్డ్ వాటర్ పరీక్షలు ఇటీవల ముంబై, అమెరికాలో నిర్వహించగా విజయవంతమయ్యాయి. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఈ కర్మాగారం నుంచి దక్షిణ కొరియాకు భారజలాన్ని ఎగుమతి చేసి గుర్తింపు తెచ్చుకుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖలో సీఐలు, ఎస్ఐలకు స్థాన చలనం కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను నూరుశాతం సీఐలు, ఎస్ఐలకు బదిలీలు జరిగాయి. ఏడేళ్లుగా ఖమ్మంలో 7, భద్రాద్రి జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్ లో పరిదిలో 38 మంది హెడ్ కానిస్టేబుల్స్, 133 కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.

సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నం.16లో 8KMల మేర సొరంగం కాలువ(టన్నెల్) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తాయి.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఏసీ మిర్చి ధర రూ.20,000 జండా పాట పలుకగా పత్తి రూ.7,300 జెండా పాట పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర మొన్నటి కంటే 50 రూపాయలు పెరగగా ఏసీ మిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. పత్తికి రేటు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.

కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.