India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఖమ్మం – 62.97%, పాలేరు -83.77%, మధిర -81.84%, వైరా-81.06%, సత్తుపల్లి-80.34%, కొత్తగూడెం -69.47%, అశ్వారావుపేట- 80.95%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 76.09% శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నామా, బీజేపీ తరఫున వినోద్ రావు పోటీ చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. తునికిబండల గ్రామానికి చెందిన గిరిజన రైతు ఈసం రామయ్య చిన్న కూతురు ఈసం రమ్య (20) అనే యువతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడింది. నోటి నుంచి నురగ వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ పార్టీ విజయానికి సోపానమని BRS ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రలో సానుకూల ప్రభావం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో BRSకు మంచి సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం ఓటర్లు విజ్ఞతతో ఓటు వేశారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలు తమ పార్టీని విశ్వసించారని చెప్పారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సెంటిమెంట్ రగిలించేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు.
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. హత్యతండాకు చెందిన బాదావత్ శంకర్ కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ సమీపంలోని పొలాల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లవలసిన విమానంలో సాంకేతిక లోపం వల్ల దాదాపు గంట వరకు టేకాఫ్ కాకుండా రన్ వే పైనే నిలిచిపోయింది. కాగా మంత్రితో పాటు విమానంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగారు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.
తిరుమలయపాలెం మండలం మేడిదపల్లిలోని పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి వివరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్ర 5 గంటల వరకు ఓవరాల్‌గా 70.76%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 59.92, పాలేరు -77.11, మధిర -76.97, వైరా-75.22, సత్తుపల్లి-74.42, కొత్తగూడెం -62.37, అశ్వారావుపేట- 76.67
Sorry, no posts matched your criteria.