Khammam

News May 13, 2024

KTDM: ముగిసిన పోలింగ్

image

ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (63.67%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్‌గా 63.67%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 51.18, పాలేరు -67.95, మధిర -68.83, వైరా-67.79, సత్తుపల్లి-67.44, కొత్తగూడెం -60.92, అశ్వారావుపేట- 68.88

News May 13, 2024

ఖమ్మంలో ఓటేసిన ట్రాన్స్‌జెండర్స్

image

ఖమ్మంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని రాజేంద్రనగర్ జెడ్పీ హైస్కూల్‌ పోలింగ్ కేంద్రంలో ట్రాన్స్‌జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఒకేసారి క్యూలైన్‌లో వచ్చి ఓటు వేశారు. తమను కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాలని వారు కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ట్రాన్స్‌జెండర్లు సూచించారు.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (50.63%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓవరాల్‌గా 50.63%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా. ఖమ్మం – 41.67, పాలేరు -53.70, మధిర -55.38, వైరా-53.72, సత్తుపల్లి-53.87, కొత్తగూడెం -47.60, అశ్వారావుపేట- 53.63

News May 13, 2024

గుండెపోటుతో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి

image

హార్ట్ ఎటాక్‌తో ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. పేరాయిగూడెం బూత్ నెంబర్ 165లో ఓటింగ్ విధులకు అధికారి గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 13, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ బహిష్కరణ

image

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ సమస్యలు పరిష్కరించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు. సాగు, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు అవేదన వ్యక్తం చేశారు.

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (31.56%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఓవరాల్‌గా 31.56%శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా.
ఖమ్మం – 26.38,
పాలేరు -32.52,
మధిర -39.87,
వైరా-32.90,
సత్తుపల్లి-35.08,
కొత్తగూడెం -29.60,
అశ్వారావుపేట- 32.01

News May 13, 2024

ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ శాతం (12.24%)

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఓవరాల్‌గా 12.24శాతం నమోదైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..
ఖమ్మం – 11.08,
పాలేరు -11.65,
మధిర -13.79,
వైరా-11.65,
సత్తుపల్లి-15.61,
కొత్తగూడెం-10.75,
అశ్వారావుపేట- 11.16.

News May 13, 2024

BREAKING.. ఖమ్మం జిల్లాలో పోలింగ్ బహిష్కరణ

image

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. ఓటు వేసేది లేదని వారు చెబుతున్నారు.

News May 13, 2024

KMM: ‘ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చు’

image

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయోచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయోచ్చని పేర్కొన్నారు.