India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావుడి
∆} మధిరలో ఓటు వేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు
∆} కల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొంగులేటి
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు ⏵శాంతి భద్రతల ఆటంకం ⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం ⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ ⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం ⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు ⏵అసత్య వార్తలు వ్యాప్తి
పోలింగ్ కేంద్రాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. 230 సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు వివరించారు.
ఖమ్మం: లోక్ సభ సాధారణ ఎన్నికల పోలింగ్ పురస్కరించుకుని నూతన కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం కంట్రోల్ రూం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 7 పెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటుచేసి, వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికల్లో పోలింగ్‌కు అవసరమైన సామగ్రి తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈవీఎంల తరలింపు, తదితర అంశాలపై ఆరా తీశారు.
వెంకటాపురం మండలంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ సిబ్బంది ఒకరు హఠాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. మండల విద్యాశాఖ రికార్డు అసిస్టెంట్ జంగిటి స్వామి ఎన్నికల సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తోటి సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఏజెన్సీలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆదివారం మణుగూరులో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమికూడరాదని తెలిపారు.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనుండగా, 621 పోలింగ్ కేంద్రాల బయట వైపు కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 103 లోకేషన్లలో 230 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే, వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలకు సంబంధించిన వారు 2,728మంది, ఉద్యోగులు 8,199మంది ఓట్లు వేశారన్నారు.
Sorry, no posts matched your criteria.