India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు తనిఖీల్లో రూ.3,47,31,750 నగదు సీజ్ చేయగా, సరైన ఆధారాలు చూపించడంతో రూ.2,61,05,180 నగదు విడుదల చేశామని సీపీ సునీల్ దత్ తెలిపారు. రూ.1,06,40,532 విలువైన మద్యం, రూ.24,39,600 విలువైన గంజాయితో పాటు రూ.20,07,500 విలువైన ఇతర సామగ్రి సీజ్ చేశామని వెల్లడించారు. పోలింగ్ సమీపిస్తున్నందున తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్ ద్వారా జిల్లాలో 75 ఫిర్యాదులు రాగా అందులో 72 ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మిగతా మూడు ఫిర్యాదుల విషయంలో మాత్రం 100 నిమిషాలు దాటాక వెళ్లినట్లు చెప్పారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1950కి ఖమ్మం జిల్లాలో 153 ఫిర్యాదులు రాగా 152, భద్రాద్రి జిల్లాలో వచ్చిన 82 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
లోకసభ ఎన్నికల దృష్ట్యా శనివారం సాయంత్రం నుండి మద్యం దుకాణాలు కల్లు కాంపౌండ్లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరిండెంట్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి వరకు మూసి ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే సమాచారం ఇవ్వాలని సూచించారు. డిటిఎఫ్ – 87126 58840, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ – 87126 58841 వైరా 87126 58844, మధిర 87126 58845, సత్తుపల్లి 87126 58847/ సింగరేణి 87126 58848 సమాచారం ఇవ్వాలన్నారు.
ఓ విద్యార్థిని ఇన్ స్టా, వాట్సప్ ఖాతాలు హ్యాక్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఘటన శనివారం వెలుగు చూసింది. కల్లూరు మండలానికి చెందిన యువతి ఖమ్మంలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి అసభ్య సందేశాలతో వేధిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో పది రోజులుగా వేధింపులు ఆగిన, మళ్లీ మొదలయ్యాయని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకవాగు ఏరియాకు చెందిన మందలపు స్వాతి(38) శనివారం మధ్యాహ్నం వరకు ఓ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లిన తర్వాత ఉరి వేసుకొని మృతి చెందింది. స్వాతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మానికి చెందిన విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి అమెరికాలోని ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా.. రాకేష్(24) అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈనెల 8న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు రాకేశ్‌తో పాటు అతని స్నేహితుడు మునిగిపోయారు. మృతదేహాలు మరుసటి రోజు లభ్యమయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో భారీ వాహనాలను 12న ఉదయం 5 గంటల నుంచి 14న ఉదయం 8 గంటల వరకు నిలిపి వేయాలని రంపచోడవరం రిటర్నింగ్ అధికారి పోలీసులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఖమ్మం: లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 13న పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి, ఎన్నికల ఏర్పాట్లు, సైలెన్స్ పీరియడ్ పై మీడియా, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ సమయం ఒక గంట పొడిగించిందని తెలిపారు.
దుమ్ముగూడెం: ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అచ్చుతాపురం గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. లక్ష్మీనగరం గ్రామం నుండి అచ్చుతాపురానికి వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు సైతం పూర్తిగా కుంగి రహదారి అధ్వానంగా మారిందని వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు.
Sorry, no posts matched your criteria.