India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,00 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,250 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫొటోలను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఫణీందర్ వివరాలు.. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన వెంకటకృష్ణ అదే గ్రామానికి చెందిన ఓ యువతి పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. అందులో ఆ యువతి మార్ఫింగ్ ఫొటోలను అప్లోడ్ చేసి బెదిరిస్తున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దెబ్బతిన్న రహదారులపై జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని మంత్రి కోమటి రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 630 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు నివేదించారు. మరమ్మతులకు మొత్తం రూ.236 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సత్వరం మరమ్మతులు పూర్తిచేయాల్సిన ప్రాధాన్యాన్ని వారు వివరించారు.

ఖమ్మం: కొత్తరేషన్ కార్డుల కోసం పేదకుటుంబాలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనసభల్లో అత్యధికంగా కార్డుల కోసమే దరఖాస్తులు అందజేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రేషన్
కార్డులు ఇవ్వలేదు. అంతకుముందు జారీచేసిన కార్డుల ఆధారంగానే ఆన్‌లైన్‌లో
వివరాలు నమోదు చేశారు. 2021లో జిల్లాలో 12,216 మందికి కొత్త రేషన్ కార్డులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీఊసేలేదు.

పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి చదువుతోపాటు వ్యాయామం కూడా ఎంతో అవసరమని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో వ్యాయమ విద్య ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు. పిల్లలకు వ్యాయామం క్రీడల వల్ల లభిస్తుందన్నారు.

విద్యాశాఖ అంచనా ప్రకారం ఖమ్మం జిల్లాకు 5,17,274 పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. వీటిలో 4,50,051 పుస్తకాలను అన్ని రకాల ప్రభుత్వ స్కూళ్లకు అందజేశారు. 2 శాతం బఫర్ స్టాక్ను అందుబాటులో ఉంచారు. 6 నుంచి పదోతరగతి వరకు 31,773 మంది విద్యార్థులకు రాత పుస్తకాలను అధికారులు అందజేశారు. గతంతో పోల్చితే ఈసారి విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం
పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు పత్తి ధర రూ.100 పెరగగా, ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ ముగియడం పరిపాలనలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నేతల్లో మళ్లీ నియామక పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వ నియామక పదవులు ఖరారవుతాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వివిధ శాఖలో ఉన్న నామినేటెడ్ పదవులకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

నేటి నుంచి జులై 6 వరకు జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాల లకు చెందిన 530 మంది విద్యా ర్థులు హాజరవుతారని వివరించారు. ఖమ్మం మెడికల్ కళాశాల భవనంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను సమ కూర్చామని ఆయన వెల్లడించారు.

ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సన్నరకం వరి సాగు గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే రైతులు సన్నరకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నార్లు పోసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నిండింది. అంతేకాక మిల్లర్లు, వ్యాపారులు సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి కనబరుస్తుండడంతో రైతులు ఆ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు.
Sorry, no posts matched your criteria.