India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

15 ఎకరాల విస్తీర్ణంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉండగా, ఉమ్మడి జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి మిర్చిని తీసుకొస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న మంత్రి తుమ్మల మార్కెట్లో నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.148కోట్ల అంచనాలతో అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను శనివారం పరిశీలించిన ఆయన మార్పులు, చేర్పులపై సూచనలు చేశారు.

టీజీ పాలిసెట్ 2024 ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ఖమ్మంలోని SRBJNR డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈ నెల 25 వరకు ఈ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మొదటి రోజు 320 మంది విద్యార్థులకు గాను 318 మంది హాజరైనట్లు కోఆర్డినేటర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నెల 27 వరకు వెబ్ ఆప్షన్స్, 30న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.

ఖమ్మంలో ఓ యువకుడు పదో తరగతి విద్యార్థినిని ఆగ్రాకు తీసుకెళ్లిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంకి చెందిన సాయికి క్రీడల్లో ప్రావీణ్యం ఉంది. తాను చదువుకున్న స్కూల్‌లో ఆటలు నేర్పుతూ విద్యార్థులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ఓసారి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోని సాయి, అమ్మాయిని బెదిరించి ఆగ్రాకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

విధినిర్వహణలో కనబర్చిన ప్రతిభకు గాను
జిల్లాలో పలువురు పోలీసు ఉద్యోగులకు ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది. ఈమేరకు ఖమ్మం ఐటీ కోర్ ఎస్ఐ సత్యనారాయణ ఉత్తమ సేవాపథకానికి ఎంపికయ్యారు. అలాగే, సేవా పతకాలకు సీసీఆర్బీ ఏసీపీ(ఫంక్షనల్ వర్టికల్స్) యు.సాంబరాజు, ఏఎస్ఐలు ఎన్.శ్రీనివాసరావు(సీ ఎస్బీ), కె. వెంకటేశ్వర్లు(కామేపల్లి), సయ్యద్ సలీమాబేగం(పీసీఆర్), ఏఆర్ ఎస్సైలు పి.కృష్ణయ్య సెలెక్ట్ అయ్యారు.

✓ వర్షాకాలం సీజనల్ వ్యాధులపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చే వారిపై ఉక్కు పాదం మోపుతానని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రుల ప్రాతినిథ్యం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం ఆచరిస్తారని.. భక్తులు స్థానాలు చేసే ప్రదేశాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం గోదావరిలో మునిగి బాలుడు మృతి చెందడంతో ఆ ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ములకలపల్లిమండలం రాజీవ్ నగర్ కాలనీలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్యను జిల్లా విద్యాశాఖ అధికారి శనివారం సస్పెండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు నిన్న ఆల్కహాల్ సేవించి మద్యం మత్తులో పాఠశాల విధులకు హాజరైనందుకు గాను, విధులలో అలసత్వం వహించినందుకుగాను, క్రమశిక్షణా చర్యలలో భాగంగా వీరయ్యను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.
Sorry, no posts matched your criteria.