India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి రోడ్డుప్రమాద ఘటనలు దడ పుట్టిస్తున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదాలకు ఎక్కువ శాతం కారణం అజాగ్రత్త, అతివేగం, మద్యంసేవించి వాహనాలు నడపడమేనని పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆక్సిడెంట్లు క్రమేపి పెరిగిపోతున్నాయి. దీంతో పోలీసులు, అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురై నాయనమ్మ మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామానికి చెందిన పాపక్క(50) మనవరాలు ఈనెల 13న టైఫాయిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైన పాపక్క ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయిందని స్థానికులు తెలిపారు.

బయ్యారంలో విషాదం జరిగింది. మండలంలోని కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పాల్వంచ రూరల్ మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామపంచాయతీ గంగాదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వగెల రామారావు ఇంటి సమీపంలో ఉన్న తాటిచెట్టుపై పిడుగుపడి కాలిపోయింది. అంతేకాక పిడుగుపాటుకు గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్
తెలంగాణ) ద్వారా డిగ్రీలో ప్రథమ సంవత్సర ప్రవేశాల ప్రక్రియలో మొదటి విడత ప్రక్రియ పూర్తి కాగా.. విద్యార్థులు ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు రిపోర్టు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని కోర్సులు కలిపి 3,120 సీట్లు ఉండగా.. 1,056 మంది మాత్రమే మొదటి విడతలో అడ్మిషన్లు పొందారు. ఇంకా 2,064 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2018 ఎన్నికలకు ముందు రేషన్ కార్డులను ఇచ్చిన గత ప్రభుత్వం.. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా రేపు మాపు అంటూ ఊరించడమే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి భిన్న వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. అంతలోనే వాతావరణం మారి
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావాసులు పగలేమో ఎండలకి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. రాత్రిపూట వర్షానికి వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం పొందుతున్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సోమవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న (సోమవారం) బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (మంగళవారం) నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని ప్రకటించారు. కావున జిల్లా రైతులు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్య మధ్య లో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, అధికారులు ఈ దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నారు.

ఖమ్మం రోటరీ నగర్‌లో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఒంటరి ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని మెడలోని బంగారాన్ని లాక్కెళ్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్‌లో శనివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని కిరాణా షాపు దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. వాటిని ఇస్తున్న క్రమంలో శనివారం మహిళ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు.
Sorry, no posts matched your criteria.