India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం BRS పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని), అతని సోదరుడు కోనేరు పూర్ణచంద్రరావు, మాజీ జడ్పీ చైర్మన్ వాసుదేవరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు చిన్ని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో BRS పార్టీలో చేరారు.
భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇకపై శ్రీరామ నామము వినిపించేలా చర్యలు చేపట్టామని ఈఓ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ఆలయ సిబ్బందితో కలిసి శనివారం ప్రారంభించారు. ఆలయం తెరిచిన సమయం నుంచి ఆలయం మూసే వరకూ ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో శ్రీరామ నామం ప్రతిధ్వనించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ నాయకులతో కలిసి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలపై చర్చించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, ఎస్.వీరయ్య పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా భద్రాద్రిలో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
తాను ఇక్కడే పుట్టి పెరిగిన రైతు బిడ్డనని, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పార్లమెంట్ కు వెళ్లి ప్రజా సమస్యలపై కోట్లాడి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న జేవీఎస్ చౌదరి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొంతకాలం పనిచేసిన అనుభవం జేవీఎస్‌కు ఉంది. ఆ అనుభవంతోనే శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆర్భాటాలు, ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. ర్యాలీలు, కార్నర్ మీటింగ్, అగ్రనాయకులను రప్పిస్తూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం వాకింగ్లో యువతను పలకరిస్తున్నారు.
ఇంటింటి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు 16,31,039 మంది కాగా వీరిలో పురుషులు 7,87,160, మహిళలు 8,43,749, ఇతరులు 130 మంది ఉన్నారు. పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా వచ్చేనెల 13న జరగనున్న ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో మహిళలు ఎటు మొగ్గు చూపితే ఆ అభ్యర్థికే విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విన్నూత్న ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మంలోని ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్‌లో ఇదీ ఆర్ఆర్ఆర్ ఛాయ్ స్పెషల్ అంటూ తనదైన శైలిలో అందరికి అందించారు. అనంతరం అక్కడే అల్పాహారం సేవించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, బేబీ స్వర్ణకుమారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.