India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయ విశ్వవిద్యాలయ పీడీసీ మొదటి సంవత్సరం (తెలుగు) పరీక్షలు మే 8 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమల దేవి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో సంప్రదించాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా ఈనెల 29న సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. అనంతరం 30న సాయంత్రం 5.30 గంటలకు తల్లాడలో, 6.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్ షో కొనసాగిస్తారు. 30న రాత్రి కొత్తగూడెంలో బస చేస్తారు. అనంతరం ఒకటో తేదీన మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నుండి ఎడవల్లి కృష్ణ, సత్తుపల్లి నుండి సంభాని చంద్రశేఖర్, రామచంద్రనాయక్, కామేపల్లి జడ్పీటీసీ బాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించారని ITDA పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డీ.ఐశ్వర్య 79.06. శ్రావణి 74.57, నాగేశ్వరి 71.18. అర్హత సాధించారని తెలిపారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు వేగం పెంచనున్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా జిల్లాలోని 21 మండలాల పరిధిలో 83,600 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 50,513, మహిళలు 33,083, ఇతరులు నలుగురు ఉన్నారు.
ఈనెల 30వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 30న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు.
లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు కోదాడకు చెందిన బానోతు భూది(55) అని స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నానని రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(19) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.
ఓ యువకుడిని ఇద్దరు యువకులు <<13119836>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన షరీఫ్ వివహేతర సంబంధం విషయంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, వంశీతో కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం షరీఫ్ రాత్రి ఓ కూల్‌డ్రింక్ షాప్ వద్ద ఉండగా పథకం ప్రకారం ఇద్దరూ గొడవపెట్టుకుని కాళ్లతో, చేతులతో కొడుతూ దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.