Khammam

News June 11, 2024

ఖమ్మం: ఈ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

image

ఇంజనీరింగ్ థ్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు చేపట్టిన ఈ సెట్ కౌన్సెలింగ్ ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించనుండగా, 14వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 18న మొదటి విడత సీట్ల కేటాయింపు, 21వ తేదీన సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న 249మంది విద్యార్థుల్లో 235 మంది హాజరయ్యారు.

News June 11, 2024

డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఐఈఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో చేరేందుకు డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామినేని సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని చెప్పారు.

News June 11, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త హంగులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్తగా మారనుంది. మార్కెట్‌కు నూతన హంగులు సంతరించుకోనున్నాయి. దేశంలోనే అధునాతన, మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు రూ.100కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2లక్షల బస్తాలు వచ్చినా ఇబ్బంది లేకుండా 17ఎకరాల విస్తీర్ణంలో 6 నుంచి 7 భారీ షెడ్ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర నిర్మాణాలకు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు.

News June 11, 2024

వర్షాలపై జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న వర్షాకాలం నేపథ్యంలో 3 నెలలు జిల్లా అధికారులు, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరమ్మతులు అవసరమున్న చోట వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాలు కారణంగా రెడ్ జోన్లో  ఉండే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కోరారు.

News June 10, 2024

‘ధరణి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలి’

image

ధరణి పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవిన్యూ అధికారులతో ధరణి, రిజిస్ట్రేషన్ల పెండింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి ఫిజికల్ ఫైళ్ల ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు.

News June 10, 2024

మంత్రి పొంగులేటిని కలిసిన తీన్మార్ మల్లన్న

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. తన గెలుపు కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

News June 10, 2024

వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: పొంగులేటి

image

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. నీటి ప్రవాహంలో ఉన్న కాలువలు, కల్వర్టులను దాటొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దని, ప్రయాణాలను కూడా కొత్త మార్గాల్లో కాకుండా రోజు వెళ్లే దారిలోనే ప్రయాణించాలని పేర్కొన్నారు.

News June 10, 2024

గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

image

అశ్వారావుపేటకు చెందిన ఇద్దరు యువకులు సోమవారం ఏపీలోని వేలేరుపాడు మండలంలో గల కట్కూరు శివాలయానికి దర్శనానికి వెళ్లారు. కాగా శివాలయం సమీపంలో ఉన్న గోదావరిలో సదరు యువకులు స్నానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 10, 2024

పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు ఆత్మహత్య

image

ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారంకు చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News June 10, 2024

ఖమ్మంలో దొంగలు హల్‌చల్

image

ఖమ్మం జిల్లాలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు గట్టినిఘా పెట్టినా వారి కళ్లు గప్పి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం కొత్తబస్టాండ్‌లో చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్‌లో నుంచి రూ.6 లక్షల విలువైన బంగారు అభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.