Khammam

News April 25, 2024

KMM: BRSఅభ్యర్థి నామా ఆస్తులు రూ.155 కోట్లు

image

ఖమ్మం BRS అభ్యర్థి నామానాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తిలో నామా పేరిట రూ.71.68 కోట్లు, భార్యచిన్నమ్మ పేరిట రూ.78.25కోట్లు, కుటుంబానికి రూ.5.96కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఇందులో నామా పేరిట 45.42 ఎకరాలు ఆయన సతీమణి పేరు మీద 25.04 ఎకరాలు కుటుంబ ఆస్తిలో 27.35 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నామా పై 2 కేసులు ఉన్నాయి.

News April 25, 2024

ఖమ్మం: గురుకుల కళాశాలలో ప్రవేశానికి 28న పరీక్ష

image

బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో, ఉమ్మడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి టి అంజలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 15 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. www.mjptbcwreis.gov.in వెబ్సైట్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 25, 2024

భద్రాద్రి: కూలీ బిడ్డకు 993 మార్కులు

image

బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ బాణోతు అంజలి సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరంలో మరింత పట్టుదలతో చదివి 993 మార్కులు సాధించింది. దీంతో అంజలికి అభినందనలు వెల్లువెత్తాయి.

News April 25, 2024

దమ్మపేట: రూ. 4.51లక్షలు పట్టివేత

image

ఎలాంటి ఆధారాలు లేకుండా ఆంధ్రాకు తరలిస్తున్న రూ. 4.51 లక్షలు నగదును ఆళ్లపల్లి అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దమ్మపేటకు చెందిన ఇద్దరు రైతులు ద్విచక్రవాహనంలో రూ.4 లక్షల51 వేల నగదు తీసుకొని ఏపీకి వెళ్తున్నారు, ఈ క్రమంలో ఆళ్లపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ నగదు పట్టుబడింది. ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

News April 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నామినేషన్
> పాల్వంచలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు > కుసుమంచిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటన
> పార్లమెంటు ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> నేటితో ముగియనున్న నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ గడువు
> మధిరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాక

News April 25, 2024

భద్రాచలంలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాచలంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. అలాగే దమ్మపేటలో అత్యల్పంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని అధికారులు చెబుతున్నారు.

News April 25, 2024

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ 

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం ఉదయం 10:30కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని కాల్వఒడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హఫీజుద్దీన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 25, 2024

బూర్గంపాడు: వడదెబ్బకు ఐటీసీ కార్మికుడు మృతి

image

బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో అశ్వాపురం మండలం కల్యాణపురం గ్రామానికి చెందిన పుష్పరాజ్ (50)సారపాక ఐటీసీ పీఎస్పీడీలో లారీ యార్డులో పనిచేస్తున్నాడు. బుధవారం విధుల్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వగా డిస్పెన్సరీలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

News April 25, 2024

ఖమ్మంలో మాజీ మంత్రి హరీశ్ రావు హెలికాఫ్టర్ చెకింగ్

image

ఖమ్మం BRS ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చిన హరీష్ రావు హెలికాప్టర్‌ను సర్దార్ పటేల్ స్టేడియంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి వస్తువులు గుర్తించలేదని తెలిపారు.

News April 25, 2024

డీఎస్పీ మృతిపై వివరాలు వెల్లడించిన ఏఎస్పి

image

సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు మరణంపై వివరాలను ఏఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. బుధవారం ఉదయం పోలీసు బృందంతో ఏరియా డామినేషన్ కోసం వెళ్లి తిరిగి పుసుగుప్పకు వస్తుండగా.. 11.10 గంటలకు శేషగిరి రావు (47) క్యాంపు నుంచి జారి పడిపోయారని అన్నారు. దీని కారణంగా అతని స్వంత AK-47 రైఫిల్ నుంచి ఒక రౌండ్ మిస్ ఫైర్ అయ్యిందన్నారు. ఈ ప్రమాదంలో అతని ఛాతీపై గాయం కావడంతో మరణించాడని తెలిపారు.

error: Content is protected !!