India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకే రఘురామ్ రెడ్డి. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేశ్‌కు ఆయన వియ్యంకుడు. గతేడాది పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికిచ్చి పెళ్లి చేయగా, పెద్ద కొడుక్కి నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహమైంది. రఘురామ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సుజాతనగర్‌కు చెందిన నాగ సీతారాములు బుధవారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతంకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికీ టికెట్ కేటాయించలేదన్నారు. తనకే వస్తుందన్న ఆశాభావంతో నామినేషన్ వేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, ఉపాధ్యక్షుడు కరీం పాషా పాల్గొన్నారు.
ఇంటర్ ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముదిగొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వాకదాని వైశాలి(17) ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఖమ్మం బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కొత్తగూడెం పట్టణానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో 90% పైగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందన్నారు. అన్ని పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ ఇస్తుందని, బీఎస్పీ మాత్రమే జనరల్ స్థానాల్లో బీసీ ఎస్సీలకు ఇస్తుందన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బుధవారం పోట్ల నాగేశ్వరరావు రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతంకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు నర్సిరెడ్డి, కొత్తగూడెం యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రాయల తరఫున కాంగ్రెస్ నాయకులు రిటర్నింగ్ అధికారికి అందించారు. కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు పాల్గొన్నారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా 74.2 శాతంతో రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. 14,564 మందికి 10,806 మంది పాసయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.73 శాతంతో 9వ స్థానంలో నిలిచింది. 7,350 మందికి 5,125 మంది పాసయ్యారు.
ఇంటర్ ఫస్టీయర్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 63.84 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. 16,015 మందికి 10,224 మంది పాసయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56.39 శాతంతో 15వ స్థానంలో నిలిచింది. 7,771 మందికి 4,382 మంది పాసయ్యారు.
నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 36,578 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19,477 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితపై రెండు పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆమె భర్త బద్రు నాయక్, కుమార్తె మహతి, కుమారుడు నయన్ ఆస్తులు విలువ అంతా కలిపి రూ.3,97,72,259 ఉంటుందని చూపించారు. రెండు వాహనాలకు రూ.39,30,000, బంగారం 115 తులాలకు గాను విలువ రూ.76,13,000 ఉన్నట్లు వివరించారు. అప్పులు రూ.10,05,024 ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు.
Sorry, no posts matched your criteria.