Khammam

News June 7, 2024

KMM-NLG-WGL: 25,854 చెల్లని ఓట్లు

image

KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం.
మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

News June 7, 2024

KHM: గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్

image

రాష్ట్ర సీఎస్ శాంతికుమారి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, పలుఅంశాలపై జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక అలా, అధికారులు పాల్గొన్నారు. అధికారులు ఎలాంటి చిన్న తప్పిదాలు జరగకుండా గ్రూప్-1 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.

News June 6, 2024

NLG: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు నాదే: తీన్మార్ మల్లన్న

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News June 6, 2024

ఖమ్మం: ముగిసిన మూడోరౌండ్.. మల్లన్నకు 18వేల లీడ్

image

నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

News June 6, 2024

ఖమ్మం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

ఖమ్మం జిల్లాలో నిన్న ఉ.8:30 ని.ల నుంచి ఇవాళ ఉ.8:30 వరకు 24 గంటల పాటు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 326.8 మీ.మీల వర్షపాతం నమోదైందన్నారు. వేంసూరు మండలంలో అత్యధికంగా 50.6 మీ.మీ, అత్యల్పంగా నేలకొండపల్లిలో 0.2 మీ.మీల వర్షపాతం నమోదైందన్నారు. కాగా రాబోయే 2, 3 రోజులు జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News June 6, 2024

విత్తన షాపుల్లో కలెక్టర్ గౌతమ్ తనీఖీలు

image

విత్తన విక్రయ షాపులు, తమ షాపులో ఉన్న విత్తనాలు, నిల్వ వివరాలు రైతులకు అర్థం అయ్యేలా తెలుగులో ప్రదర్శించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. నగరంలోని గాంధీ చౌక్, బర్మా షెల్ రోడ్ లోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ. రేటు తెలుసుకున్నారు.

News June 6, 2024

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు: సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఉ.6 గంటల నుంచి సా.6 వరకు అంక్షాలు అమలులో ఉంటాయని, పరీక్షా కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు నిబంధనలు వర్తిస్తాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News June 6, 2024

ఖమ్మం: రెచ్చిపోతున్న హిజ్రాలు..

image

ఖమ్మం జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. సత్తుపల్లి మండలం సత్యంపేట – రుద్రాక్షపల్లి రహదారిపై వచ్చే పోయే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే కదలనివ్వకుండా నడిరోడ్డులో ఆపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News June 6, 2024

MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌కు తేలుకాటు

image

నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌ తేలుకాటుకు గురైంది. మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బుధవారం రాత్రి తేలుకాటు వేసింది. అక్కడున్న సిబ్బంది 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News June 6, 2024

కొత్తగూడెం: పిడుగు పడి 12 ఏళ్ల బాలుడు మృతి

image

కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి మండలం రాఘవాపురం పరిధిలో గల సీతానగరం గ్రామానికి చెందిన మేకల సంతోష్ (13 ) అనే బాలుడు బుధవారం పిడుగు పాటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. సంతోష్, ఇద్దరు స్నేహితులతో గ్రామ శివారులోని చేను దగ్గరకు వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ముగ్గురు చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో సంతోష్ చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.