India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

ఖమ్మంలో రఘురాం రెడ్డికి 4.67లక్షల పైచిలుకు మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఆయనకు 61.29 శాతం శాతం ఓట్లు దక్కడం విశేషం. అభ్యర్థిని ప్రకటించడం లేటైనా, భారీ మెజార్టీతో గెలవడానికి పొంగులేటి, తుమ్మల, భట్టి కృషి చేశారు. ఖమ్మం ఎంపీ సీటును వీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . దీంతో గతంలో ఖమ్మం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ సాధ్యమైంది.

ఖమ్మం: జూన్ 9న నిర్వహించు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో గ్రూప్-1 పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రాధాన్యత ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 96 టేబుళ్లపై 96 వేల ఓట్లు లెక్కించనున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4రౌండ్లలో పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలవ్వగా.. అందులో 2139 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. అర్ధరాత్రిలోపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికల్లో 2021లో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ స్థానంలో విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యతా ఓట్లతో పల్లా గెలిచారు. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. పల్లా రాజీనామాలతో ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.

నల్గొండ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్లో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ సాగుతుంది. 4 హాల్స్ లో ఏర్పాటు చేసిన 96 టేబుళ్లపై ఉ.8 గంటల నుంచి బ్యాలెట్ పేపర్లను కట్టే ప్రక్రియను ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు. కాగా మద్యాహ్నం తరువాత మొదటి ప్రాధాన్యత ఓట్లను సిబ్బంది లెక్కించనున్నారు.

అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో జనసేన ఫ్లెక్సీ చింపిన విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జనసేన ఫ్లెక్సీని వైఎస్ఆర్సీపీ అభిమానులు చింపేశారని జనసేన అభిమానులు ఆరోపించారు. తోట శ్రీను అనే వ్యక్తి అడగడానికి వెళ్తే చితకబాదారని చెప్పారు. ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

కార్పొరేట్ కళాశాలల పథకం ద్వారా ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాలను ఈ నెల 6న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని సీజీజీ-ఈపాస్ నుండి మెసేజ్ వచ్చిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 6న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.

వరుస సెలవులు అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఈనెల 7 నుంచి పున:ప్రారంభమవుతుందని బుధవారం మార్కెట్ అధికారులు తెలిపారు. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించి మార్కెట్లో క్రయవిక్రయాలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.