India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం ఎంపీ స్థానాన్ని 2014లో వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన పొంగులేటి గెలిచారు. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ మెజార్టీతో ఖమ్మంలో పాగా వేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లైంది.

నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందనీ, అలాగే రాత్రి 11 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలై .. చెల్లిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ఈసీ ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 49.80గా నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లే సాధించి ఓటమి చవిచూశారు.

ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను పరిశీలిస్తే ఖమ్మం అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఆయన 86,565 ఓట్ల మెజార్టీ సాధించగా, కొత్తగూడెంలో 76, 177 ఓట్లు, సత్తుపల్లిలో 69,408 ఓట్లు, మధిరలో 63,569, వైరాలో 61,778, పాలేరులో 61,681 ఓట్లు, అశ్వారావుపేటలో 42,927 ఓట్ల మెజార్టీ సాధించారు.

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం 1,18,636 ఓట్లు పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20,488 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో 1.80 శాతం పోల్ కాగా, ఈసారి ఓట్ల శాతం 9.55 శాతానికి పెరగడం విశేషం. తొలి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడంతో బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకు లక్ష ఓట్లకు పైగా పోలైనా ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు.

పొంగులేటి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో రెండు పోలింగ్ బూత్ లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. నారాయణపురంలో 94వ బూత్‌లో బీజేపీకి 89 ఓట్ల మెజారిటీ వచ్చింది. అక్కడ మొత్తం 735 ఓట్లు పోలవగా బీజేపీ 404, కాంగ్రెస్ 315, బీఆర్ఎస్ 16 ఓట్లు సాధించింది. బూత్ నంబర్ 95లో 320 ఓట్లు పోలవగా బీజేపీ 197, కాంగ్రెస్ 112, బీఆర్ఎస్‌కు 11ఓట్లు లభించాయి. బీజేపీకి 85 ఓట్ల ఆధిక్యం దక్కింది.

ఖమ్మంలో నామా పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఖమ్మంలో 17సార్లు ఎన్నికలు జరగ్గా 2019 ఎన్నికల్లో నామాకు 1,68,062 మెజార్టీ వచ్చింది. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఆయన నామాపై 4,67,847 మెజార్టీతో గెలిపొందారు. నామాకు 2,99,082 ఓట్లు వచ్చాయి. కాగా ఖమ్మంలో ఈస్థాయిలో మెజార్టీ రావడం ఇదే తొలిసారి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 6782 ఓట్లు పోలవగా.. మహబూబాబాద్‌లో 6585 ఓట్లు పోలయ్యాయి. కాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి రఘురాం రెడ్డి 61.29% ఓట్లతో సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. నామా నాగేశ్వరరావుకు 23.9% ఓట్లు పోలయ్యాయి.

ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన రామసహాయం రఘురాంరెడ్డికి ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ సర్టిఫికేట్ అందజేశారు. తన గెలుపునకు సహకరించిన వారికి రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

తాను గెలిచినా.. ఓడినా నిత్యం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కూడా అంతే ఇష్టమని చెప్పారు. గెలిస్తే పొంగిపోయేది లేదని ఓడితే కుంగేది లేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.