India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడతూ.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే తనను గెలిపించాయని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి తెలిపారు. ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్ కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల టెన్షన్ ఇక్కడ కూడా నెలకొంది. ఏలూరు జిల్లాకు సమీపంలోని అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో జోరుగా ఆంధ్ర ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఫలితాల కోసం యువత టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి ఎదురుచూస్తున్నారు. ఫలితాల అనంతరం సంబరాల కోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు.

ఉమ్మడి జిల్లాల్లోని 10 శాసనసభ నియోజకవర్గాలకు రూ.10కోట్ల చొప్పున మంజూరయ్యాయి. వీటిలో రూ.2కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రూ.కోటిని తాగునీటి అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిధులకు సంబంధించి పనులు అంచనాల దశలోనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అనుమతితో తాగునీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి.

ఖమ్మం MP ఓట్ల లెక్కింపునకు పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో సర్వం సిద్ధమైంది. ఖమ్మం, పాలేరు, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 115 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా ఒక్కో రౌండ్ కు కనీసం 30 నిమిషాల వ్యవధి పడుతుంది. ఈ లెక్క ప్రకారం 8.50 వరకు ఫలితం వెల్లడవుతుందని అధికారులు భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా జూన్ 4న ఉ.6 గంటల నుండి జూన్ 5 ఉ.6 గంటల వరకు అంక్షలు విధించినట్లు తెలిపారు. గుంపులుగా, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఉరేగింపులు, ధర్నాలు, నిషేధమని పేర్కొన్నారు

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం అయింది. మొత్తం 117టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఖమ్మం అసెంబ్లీకి 18 టేబుల్స్ ఉండగా, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 132 రౌండ్‌లలో ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఎంపీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్త కొత్తూరు గ్రామంలో మంత్రి పొంగులేటి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అడిగిన ప్రతి న్యాయమైన కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో పేదవారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.

ఎంపీ ఎన్నికల్లో పాలేరు. నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ రాబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్త కొత్తూరు గ్రామంలో మంత్రి పొంగులేటి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అడిగిన ప్రతి న్యాయమైన కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో పేదవారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో ఖమ్మం ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి నామా, కాంగ్రెస్ నుంచి RRR, BJP నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Sorry, no posts matched your criteria.