India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఫలితాల కోసం జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫలితాల సమాచారం ప్రజలకు నేరుగా చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, వైరా, సత్తుపల్లి, మధిర బస్టాండ్ల వద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండ దెబ్బతో ఆదివారం ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడ్డాడు. ఖమ్మంలో ఇద్దరు, వైరాలో ఒకరు, నేలకొండపల్లిలో కరువు పనికెళ్తూ ఒకరు, బూర్గంపాడులో ఒకరు, కొత్తగూడెంలో మరొకరు వడదెబ్బతో చనిపోయారు.

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు కౌంటింగ్‌పై కలెక్టర్ గౌతమ్ సమీక్ష
∆} చింతకాని మండలంలో పవర్ కట్
∆} ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఖమ్మం నియోజకవర్గానికి 18, మిగతా చోట్ల 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని అధికారులు నిర్ణయించింది. మహబూబా బాద్ లోక్‌సభ స్థానం ఓట్లను మహబూబాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో, ఖమ్మం లోక్‌సభ స్థానం ఓట్లను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు.

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను అధికారులు పరీశీలించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే, కౌంటింగ్ పరిశీలకులు ప్రేదిమాన్ కృషన్ భట్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి కేంద్రాన్ని తనీఖీ చేశారు. కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

తిరుపతి ప్రసాదం ఇచ్చేందుకు బంధువుల ఇంటికి వెళుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం తిరుమలాయపాలెంలో జరిగింది. ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెంకి చెందిన సోమేశ్వరరావు ఇటీవల తిరుపతి వెళ్లి వచ్చాడు. మరిపెడ మండలం ఎల్లంపేటలో బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు వెళ్తుతుండగా తిరుమలాయపాలెంలో వద్ద బైక్ ఢీకొట్టింది. దీంతో సోమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో బాగంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్దిని కలెక్టర్ వివరించారు. అన్ని రంగాలలో జిల్లా అభివృద్ది పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఈక్రమంలో ఏర్పాటు చేసిన పలు సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కుల బహిష్కరణ నెపంతో తమపై గ్రామస్థులు దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం చాపరాలపల్లికి చెందిన గద్దల రాజు రెండు నెలల క్రితం బొడ్రాయి ప్రతిష్ఠకు చందా ఇవ్వలేదు. దీంతో కుల బహిష్కరణ చేశారు. శనివారం తన సమీప బంధువు చనిపోగా వెళ్లిన క్రమంలో గ్రామస్థులు చేశారని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలోనూ ఎటువంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సి) విషయంలోనూ జాగ్రత్త వహించాలని విద్యుత్ అధికారులను సూచించారు.

ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం గ్రామీణ మండలం గుదిమళ్ల నంద్యతండాకు చెందిన బాణోత్ ప్రసాద్(25)కు ఇటీవల ప్రేమ వివాహమైంది. పనిచేయకుండా తిరుగుతున్నావంటూ శనివారం భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.