India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావ్ నామినేషన్ వేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్‌కు ఆయన అందించారు. తాండ్ర వెంట జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు. గెలుపుపై ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.
ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆయన హైదరాబాదులో బీఫామ్ అందుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు తెలిసింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింట రూ.19500, పత్తి క్వింటా జండా పాట 7150 రూపాయలు ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి కంటే ఈరోజు భారీగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి 500, పత్తి 150 రూపాయలు తగ్గింది.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోందని రెండు సార్లు ప్రజలను మోసం చేసిన మోదీ మూడోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.
తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపాడుకి చెందిన వెంకన్న(55) కల్లు గీత కార్మికుడు రోజులాగే సమీప గ్రామమైన చంద్రుతండాలో తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కన్నాయిగూడెం ఎంపీటీసీ పర్స బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్లు తెలుస్తుంది.
ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థిని ప్రకటనపై కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సింగరేణి అధికారులు విడుదల చేశారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.
వర్షాభావానికి తోడు ఎండల తీవ్రతతో జిల్లాలో పలు చెరువుల్లో నీరు అడుగంటి నెర్రెలు బారుతున్నాయి. సాగునీటి కొరతతో రైతులు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నారు. చెరువులో ఉన్న కొద్దోగొప్ప నీటితో చేపలు బతుకుతాయని ఆశిస్తున్న మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది. చెరువులు ఎండి లక్షల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో ఉపాది లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే చాలా మంది అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నా.. ఖమ్మం జిల్లాలో కొంత మందికి ఇంకా గ్యాస్ డబ్బులు జమ కాలేదు. దీనికి లబ్దిదారులు LPG గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC చేయకపోవడమే కారణమని తాజాగా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. గ్యాస్ కనెక్షన్లు కలిగిన 30% మంది మాత్రమే e-KYC చేసుకున్నారని, మిగత వారు వెంటనే e-KYC చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.