Khammam

News June 1, 2024

కొత్తగూడెం: వడదెబ్బతో మహిళ మృతి

image

వడదెబ్బతో మహిళ మృతిచెందిన ఘటన మణుగూరులో చోటుచేసుకొంది. ప్రకాశం జిల్లాకి చెందిన సిద్ధ సీతాలక్ష్మి(61)తో పాటు మరో ముగ్గురు మినీ వ్యానులో భద్రాచలం సీతారామచంద్ర స్వామి, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి తీర్థయాత్రలకు వెళ్లారు. అస్వస్థతకు గురైన సీతాలక్ష్మిని మణుగూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది.

News June 1, 2024

ఖమ్మంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత ఎన్నికల్లో‌ ఓటర్లు ఖమ్మం (BRS), మహబూబాబాద్‌ (BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సెలవు
✓అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News June 1, 2024

రెడ్ జోన్‌లో భద్రాద్రి జిల్లా

image

రెండ్రోజులుగా భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం రెడ్ జోన్ హెచ్చరికలను జారీచేసింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా గ్రీన్ జోన్‌గా పరిగణిస్తారు. భద్రాద్రి జిల్లాలోని మండలాలన్నీ రెడ్ జోన్‌కు చేరువ అవుతుండగా జిల్లా ప్రజల్లో ఆందోళన రేకెత్తుతుంది.

News June 1, 2024

ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం: మంత్రి తుమ్మల

image

ఈ నెల 7, 8 వ తేదిలలో హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అన్నారు. వివిధ దేశాల నుండి వరి శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సు నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల సంస్థ డైరెక్టర్ మెర్సిడెస్ జోన్స్, స్థానిక నిర్వాహుకులు ఈరోజు మంత్రి తుమ్మలను కలిశారు.

News May 31, 2024

ఖమ్మం: బంగారం బిస్కెట్లు స్వాధీనం

image

చెన్నై నుంచి ఎలాంటి పన్నులు చెల్లించకుండా తీసుకువస్తున్న బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె. మహేశ్, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పి. వెంకటేశ్వరరావు ఇద్దరూ బావా బావమరుదులు. చెన్నై నుంచి 400 గ్రాముల బంగారం బిస్కెట్లను అనధికారికంగా తీసుకువస్తుండగా విజయవాడ వెస్ట్ బుకింగ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 31, 2024

సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి వృద్ధురాలు మృతి

image

అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అమెర్డ కాలనీకి చెందిన షేక్ ఖాద్రి (80)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News May 31, 2024

ఖమ్మం: పంచాయతీ ఎన్నికలు.. వారు మళ్లీ పోటీ చేయొచ్చు!

image

2019లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా రూల్స్ పాటించని కారణంగా 98 మంది వార్డు సభ్యులపై అనర్హత విధించారు. ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఆదాయ, వ్యయ వివరాలను అధికారులకు సమర్పించాలి. కొందరు వార్డు సభ్యులు నిరక్షరాస్యత, అవగాహన లోపంతో ఆ వివరాలను అందజేయలేదు. 2021లో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. జూన్‌తో నిషేధం ముగియడంతో వారికి మళ్లీ పోటీ చేసే ఛాన్స్ లభించింది.

News May 31, 2024

గోల్కొండ, శాతవాహన రైళ్లు రద్దు

image

ఖమ్మం మీదుగా వెళ్లే గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లను నిర్ణీత తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఎండీ జాఫర్ గురువారం తెలిపారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్ జూన్ 1, 2, 5, 6, 8, 9 తేదీల్లో, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్(12713), పై తేదీల్లో రద్దు చేసినట్లు వివరించారు.

News May 31, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్షా సమావేశం
∆} తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాల అంతరాయం
∆} వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో పవర కట్