India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి క్వింటా జండా పాట రూ.20,000, పత్తి జెండా పాట క్వింటా రూ.7200 పలికినట్లు అధికారులు వెల్లడించారు. పత్తి, మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సెలవు ఉండడంతో ఈరోజు పంట మార్కెట్ కు పెద్ద ఎత్తున వచ్చింది.
బయ్యారం మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. కొయ్యగూడెం గ్రామ పంచాయతీలోని చుంచు బంధంతండాలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం జరగనున్న రామయ్య మహా పట్టాభిషేకం
మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల వల్ల తీవ్రతరం అయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. కాగా వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఏకంగా 44.2 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మిలో గరిష్టంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే ఎండ మొదలై పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి ఉంటోంది. కాగా, ఖమ్మంలో 43.9, కూసుమంచిలో 43.7, కల్లూరులో 43.6, నేలకొండపల్లిలో 43.5, తల్లాడ, తిరుమలాయపాలెంల్లో 43.3, తిమ్మారావుపేటలో 43.2, చింతకాని 43.1, సత్తుపల్లిలో 42డిగ్రీల మేర నమోదైంది.
గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీఆర్కేపురం ఎంపీపీ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న శేషాచలం బుధవారం చాతిలో నొప్పితో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శేషాచలం మృతికి పలువురు సంతాపం తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలుకానుంది. ఖమ్మం కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 25వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. కాగా, ఈనెల 26న స్క్రూటినీ చేయనుండగా, 29 వరకు ఉపసంహరించుకునే వీలుంది. ఆపై మే 13న పోలింగ్ నిర్వహంచి జూన్ 4న ఫలితం వెల్లడిస్తారు. దీంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈనెల 16న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 16,26,427 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈనెల 25న వెలువరించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనుండగా ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న యువత 49,393 మంది ఉండగా, వీరు ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే వయస్సు వారి నుంచి అందిన దరఖాస్తులు మరో 1,465 పెండింగ్ ఉన్నాయి.
ప్రభుత్వం పథకాలు అందించడంలో భాగంగా రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
త్వరలో టెన్త్, ఇంటర్ వార్షిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, సమాజం అండగా నిలవాలని నిపుణులు అంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారనే కారణంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని ఓ కంట కనిపెట్టాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఒకవేళ ఫెయిల్ అయితే వృత్తి నైపుణ్య కోర్సుల వైపు ప్రోత్సహిస్తూ.. సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ భరోసా కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.