Khammam

News May 30, 2024

KMM: ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 1962, 102 వాహనాల పైలట్ (డ్రైవర్) ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 31న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

News May 30, 2024

ఇల్లందు: వడదెబ్బతో కూలీ మృతి

image

అడ్డా మీద కూలీ పనికి వెళ్తున్న ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన రజబెల్లి (55) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు ఇష్టూ జిల్లా అధ్యక్షుడు యాకుబ్ షావలి బుధవారం తెలిపారు. 30 ఏళ్లుగా బొగ్గు కాటా వద్ద పనిచేస్తున్న రజబెల్లి ఏడాదిగా బొగ్గు లేకపోవటం వల్ల కుటుంబాన్ని పోషించుకునేందుకు అడ్డా మీద కూలీకి వెళ్తున్నాడని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News May 30, 2024

ఖమ్మం: గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

image

పట్టభద్రుల MLC ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్ధులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్ గౌతమ్

image

జిల్లాలో ఈ వర్షాకాలంలో 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశామని, ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 4,49,347 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, బుధవారం నాటికి 34 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించామని వివరించారు. అందరికీ సరిపడా విత్తనాలు సమకూరుస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.

News May 30, 2024

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు: భద్రాద్రి డీఈవో

image

జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని భద్రాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో పంపిస్తామని తెలిపారు.

News May 30, 2024

ఖమ్మం: ‘వివాహేతర సంబంధం వల్లే తల్లీబిడ్డలను చంపాడు’

image

రఘునాథపాలెం మండలం బాబోజితండాకు చెందిన ప్రవీణ్, భార్య కుమారి(25), పిల్లలు కృషిక (5), తనిష్క(3) కారులో వెళ్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టిన విషయం విదితమే. ప్రవీణ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ కూతురు, మనవరాళ్లను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే నిజనిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.  

News May 30, 2024

ఖమ్మం: కడసారి చూపునకు రాని భర్త ప్రవీణ్

image

రఘునాథపాలెం మండలంలో మంగళవారం కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో కుమారితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలో భర్త ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వారి మృతదేహాలకు శవ పరీక్షల అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో మృతదేహాలను బావోజీ తండాకు తరలించారు. బంధువుల కన్నీరు నడుమ ముగ్గురికి ప్రవీణ్ తండ్రి మత్రు అంత్యక్రియలు నిర్వహించారు.

News May 30, 2024

KTDM: పెళ్లి బరాత్‌లో విషాదం 

image

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కంట్లం గ్రామానికి చెందిన కామరాజు మంగళవారం గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకలో డీజే వద్ద డ్యాన్స్ చేస్తున్నాడు. తనకు ఇష్టమైన పాటను పెట్టేందుకు సిస్టం వద్దకు వెళ్లి పాటలు మారుస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు.

News May 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం
✓లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పై అధికారులతో కలెక్టర్ గౌతమ్ సమీక్ష
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News May 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 6 రోజుల సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 6 రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. జూన్ 1న వారాంతపు యార్డు బంద్, 2న ఆదివారం సాధారణ సెలవు ఉంటుందన్నారు. 3, 4, 5 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకుని ఎన్నికల అధికారులు, కలెక్టర్ ఆదేశాలమేరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 6న అమావాస్య సెలవు ఉందని, 7వ తేదీ శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం కానుందని వెల్లడించారు.