India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

WGL-KMM-NLG పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ సోమవారం ముగిసింది. 1.27 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 5.05 లక్షల ఓట్లకు గానూ 3.85 లక్షల మంది ఓటర్లు ఓటేయగా..1.19 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 4.63 లక్షల ఓట్లకు గానూ 3.36 ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారికి సంఖ్య 8వేలకు పెరిగింది.

జూన్ 4వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. రఘునాథపాలెం మండలం హర్యాతండా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఖమ్మం జిల్లా బావోజీ తండా వాసులుగా గుర్తించారు.

చర్ల సరిహద్దు ఛత్తీస్ గఢ్ దంతెవాడ జిల్లా గిర్సపా అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర అమరుస్తున్న 15 మంది మావోయిస్టులను డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరి వద్దనుండి ఒక మందు పాతర, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్, ఒక టిఫిన్ బాక్స్ మావోయిస్ట్ సామాగ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైరా మండలం నారపునేనిపల్లిరీ చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్ష(22) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, అమెరికాలో సాఫ్ట్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో వర్షకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వర్ష మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే వారు ఇక వేచి ఉండాల్సిన పని లేదు. ఓపీ చీటీ కోసం గంటలకొద్ది క్యూలో నిలబడాల్సిన బాధ తప్పినట్లే. ప్రభుత్వాస్పత్రుల్లో సత్వర సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) యాప్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని ఖమ్మం జనరల్ ఆస్పత్రితో పాటు సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

భద్రాచలం పట్టణంలోని పలు హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీళ్లో కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన
ఐస్ క్రీమ్, చనిపోయిన బొద్దింకలు, ఈగలు ఉన్న చట్నీ వెలుగు చూశాయి. దీంతో అధికారుల పర్యవేక్షణ లేక హోటల్స్ యాజమాన్యాలు ఇష్టారీతిన ఆహారం తయారు చేస్తూ,
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ హోటల్స్‌లో ఫుడ్ తింటే బెడ్ ఎక్కడం
ఖాయమని ప్రజలు మండిపడుతున్నారు.

భద్రాద్రి జిల్లా పోలీసులు గంజాయిని భారీగా పట్టుకున్నారు. దీని విలువ రూ.1.23 కోట్లుగా లెక్కగట్టారు. సీఐ శివప్రసాద్ వివరాల ప్రకారం.. ఎస్సై పురుషోత్తం తన బృందంతో కలిసి స్థానిక పాత బస్‌డిపో వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఓ డీసీఎం వ్యానును సోదా చేయగా క్యాబిన్ వెనుక అనుమానం రాకుండా నిర్మించిన బాడీ(అర) కనిపించింది. దాంట్లో 492 కిలోల గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. 4గురిపై కేసు నమోదు చేశారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పాల్వంచ మండలంలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. పాల్వంచ మండలం జగన్నాథపురానికి చెందిన మాలోత్ రాము(52), ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాము సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు

భార్యతో ఓటు వేయించేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొని దంపతులిద్దరూ మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలోని చోటుచేసుకుంది. SI సైదా రవూఫ్ వివరాలు.. సంపత్‌నగర్‌కు చెందిన పాయం జానకి(35)తో ఓటు వేయించేందుకు భర్త కృష్ణయ్య(39) బైక్‌పై టేకులపల్లికి వెళ్తుండగా లాలుతండా సమీపంలో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిని వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. వీరికి కుమార్తె షణ్ముకప్రియ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.